కపిల్‌దేవ్‌ తర్వాత గొప్ప ఆల్‌రౌండర్ అతడే..! ఫాస్ట్ బౌలింగ్‌.. సూపర్‌ బ్యాటింగ్

|

Oct 11, 2021 | 7:58 AM

Cricket News: భారత క్రికెట్ జట్టులోకి అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లు ఎప్పుడూ వస్తూనే ఉంటారు. అత్యుత్తమ స్పిన్నర్లు ఉన్నారు. కానీ ఒక లోపం ఉంది. అదేంటంటే ఫాస్ట్

కపిల్‌దేవ్‌ తర్వాత గొప్ప ఆల్‌రౌండర్ అతడే..! ఫాస్ట్ బౌలింగ్‌.. సూపర్‌ బ్యాటింగ్
Hardik Pandya
Follow us on

Cricket News: భారత క్రికెట్ జట్టులోకి అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లు ఎప్పుడూ వస్తూనే ఉంటారు. అత్యుత్తమ స్పిన్నర్లు ఉన్నారు. కానీ ఒక లోపం ఉంది. అదేంటంటే ఫాస్ట్ బౌలింగ్‌ ఆల్‌రౌండర్. కపిల్‌దేవ్‌ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసింది ఒక్కరే. అతను ఎవరో కాదు హార్దిక్ పాండ్యా. ఈ రోజు అతడి పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడి కెరీర్‌ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హార్దిక్ పాండ్య అక్టోబర్ 11,1993 న గుజరాత్ లోని సూరత్ జిల్లాలో చోర్యాసిలో జన్మించారు. హార్దిక్, అతడి అన్నయ్య కృనాల్ పాండ్య చిన్న వయసులోనే క్రికెట్‌ను కెరీర్‌గా ప్రారంభించారు.

మాజీ భారత వికెట్ కీపర్ కిరణ్ మోర్ అకాడమీలో మెరుగులుదిద్దారు. హార్దిక్ పాండ్యా మొదటగా వడోదర కోసం తన దేశీయ క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించాడు. తర్వాత అతను ముంబై ఇండియన్స్ టాలెంట్ స్కౌట్స్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. 2015 లో, ముంబై అతన్ని కొనుగోలు చేసింది. మొదటి ఐపిఎల్ సీజన్‌లో హార్దిక్ అద్భుత ప్రదర్శన ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను కేవలం 8 బంతుల్లో 21 పరుగులు చేసి జట్టును గెలిచాడు. ఇక్కడ నుంచి అతడ గొప్ప క్రికెటర్‌గా మారాడు.

హార్దిక్ జనవరి 2016 లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 మ్యాచ్‌లో భారత జట్టుకు అరంగేట్రం చేశాడు. త్వరలో అతను ఆసియా కప్ కోసం భారత జట్టులో చోటు సంపాదించాడు. ఇక్కడ నుంచి నేరుగా టీ 20 ప్రపంచకప్ జట్టులోకి ప్రవేశించాడు. ప్రపంచ కప్‌లో అతనికి బ్యాటింగ్‌ అవకాశాం రాలేదు. కానీ బౌలింగ్‌లో చిరస్మరణీయమైన ప్రదర్శన చేశాడు. బెంగళూరులో భారత్‌తో జరిగిన చివరి ఓవర్‌లో బంగ్లాదేశ్‌కు 11 పరుగులు అవసరం. కెప్టెన్ ఎంఎస్ ధోని అనుభవం లేని హార్దిక్‌కు బంతిని అందించాడు మొదటి 3 బంతుల్లో 2 ఫోర్లతో సహా 9 పరుగులు చేశాడు. ఇప్పుడు 3 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేయాలి. అప్పుడు హార్దిక్ రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి అద్భుతం సృష్టించాడు.

హార్దిక్ పాండ్యా భారతదేశం కోసం 11 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు, 1 సెంచరీ, 4 అర్ధ సెంచరీలతో సహా 532 పరుగులు చేశాడు. ఇది కాకుండా అతని ఖాతాలో 17 వికెట్లు కూడా ఉన్నాయి. అదే సమయంలో 63 వన్డేలలో, హార్దిక్ 7 అర్ధ సెంచరీల సహాయంతో 1286 పరుగులు చేశాడు. ఇందులో అతని స్ట్రైక్ రేట్ 116. ఈ పరుగులే కాకుండా హార్దిక్ 57 వికెట్లు కూడా తీశాడు. టీ 20 విషయానికొస్తే హార్దిక్ 484 పరుగులతో 42 వికెట్లు తీశాడు. ఐపిఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్‌లో హార్దిక్ ఒక భాగం. 4 సార్లు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

Tirumala Temple: నేడు తిరుమలకు సీఎం వైఎస్ జగన్.. శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం..

Viral photos: వర్షాకాలంలో మునుగుతుంది.. వేసవిలో తేలుతుంది..! అద్భుతమైన చర్చి..

Crime News: ఇలా ఎందుకు చేశావమ్మ..? ఇద్దరు పిల్లలను చంపిన కన్నతల్లి.. ఉరి వేసి దారుణంగా..