టీ20 ప్రపంచకప్ అనంతరం ఐసీసీ కొత్త టీ20ఐ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈసారి టీ20 బ్యాట్స్‌మెన్ల జాబితాలో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ అగ్రస్థానంలో ఉండగా.. బౌలర్లలో ఇంగ్లాండ్ ఆటగాడు ఆదిల్ రషీద్ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టాప్ ప్లేస్‌ను కైవసం చేసుకున్నారు. ఇక టీ20 బ్యాట్స్‌మెన్ల జాబితాలోని టాప్ 10లో కేవలం ఇద్దరు భారత బ్యాటర్లు మాత్రమే తమ స్థానాన్ని పదిలం చేసుకోగలిగారు. టీ20 వరల్డ్‌కప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఎడమచేతి వాటం బ్యాటర్ యశ్వసి జైస్వాల్ 7వ స్థానంలో ఉండగా.. సూర్యకుమార్ యాదవ్ రెండోస్థానానికి పడిపోయాడు. అటు రోహిత్ శర్మ 527 పాయింట్లతో 38వ స్థానంలో, విరాట్ కోహ్లీ 499 పాయింట్లతో 47వ స్థానంలో ఉన్నారు.
టీ20 బౌలర్ల జాబితా టాప్ 10లో ఇద్దరు భారత బౌలర్లు ఉన్నారు. స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ టాప్-10 జాబితాలో తమ స్థానాలను పదిలం చేసుకోగా.. టీమిండియా కీలక పేసర్ జస్ప్రీత్ బుమ్రా 12వ స్థానంలో కొనసాగుతున్నాడు.
టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో టీమిండియా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా అగ్రస్థానంలో నిలిచాడు. ఈ టీ20 ప్రపంచకప్‌లో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో పాండ్యా అదరగొట్టిన సంగతి తెలిసిందే. అతడి అద్భుత ప్రదర్శనకు గానూ రెండు స్థానాలు ఎగబాకి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు హార్దిక్ పాండ్యా.
ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో భారత్ నుంచి తొలి ఆల్‌రౌండర్‌గా అగ్రస్థానాన్ని దక్కించుకుని రికార్డు నెలకొల్పాడు హార్దిక్. గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్ తర్వాత టీ20ఐ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్న ఆరో భారతీయ క్రికెటర్‌గా హార్దిక్ పాండ్యా నిలిచాడు. గతంలో గంభీర్, కోహ్లీ, స్కై బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. బుమ్రా, బిష్ణోయ్ బౌలర్ల జాబితాలో టాప్ ప్లేస్ దక్కించుకున్నారు.
Hardik Pandya rises to No.1 in the latest ICC Men’s T20I All-rounder Rankings 🔝
How the Rankings look after #T20WorldCup 2024 ⬇️https://t.co/vbOk3XT7C3
— ICC (@ICC) July 3, 2024
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..