T20 World Cup 2024: ఈ పోరగాడు ఇప్పుడు టీమిండియా స్టార్ క్రికెటర్.. ప్రపంచకప్‌లో ఇరగదీస్తుండు.. గుర్తు పట్టారా?

|

Jun 23, 2024 | 12:09 PM

పై ఫొటోలో అమ్మతో కలిసి చిరునవ్వులు చిందిస్తోన్నఈ పోరగాడిని గుర్తు పట్టారా? ఈ పిల్లగాడు ఇప్పుడు పెరిగి పెద్దై టీమిండియా స్టార్ క్రికెటర్ అయ్యిండు. ప్రస్తుతం విండీస్ దీవుల్లో జరుగుతోన్న టీ20 ప్రపంచకప్ లో ఇరగదీస్తున్నాడు. ఇతని కారణంగానే టీమిండియా వరస విజయాలు సాధిస్తోంది

T20 World Cup 2024: ఈ పోరగాడు ఇప్పుడు టీమిండియా స్టార్ క్రికెటర్.. ప్రపంచకప్‌లో ఇరగదీస్తుండు.. గుర్తు పట్టారా?
Team India Cricketer
Follow us on

పై ఫొటోలో అమ్మతో కలిసి చిరునవ్వులు చిందిస్తోన్నఈ పోరగాడిని గుర్తు పట్టారా? ఈ పిల్లగాడు ఇప్పుడు పెరిగి పెద్దై టీమిండియా స్టార్ క్రికెటర్ అయ్యిండు. ప్రస్తుతం విండీస్ దీవుల్లో జరుగుతోన్న టీ20 ప్రపంచకప్ లో ఇరగదీస్తున్నాడు. ఇతని కారణంగానే టీమిండియా వరస విజయాలు సాధిస్తోంది. టీ20 వరల్డ్ కప్ సెమీస్ కు చేరువైంది. ఇప్పుడైతే అతనిని అందరూ పొగుడుతున్నారు కానీ కొన్ని రోజుల క్రితం వరకు అతనిపై భారీగా ట్రోలింగ్ జరిగింది. స్వార్థ పరుడు, సెల్ఫిష్ అంటూ ముద్ర వేసి నెట్టింట తీవ్ర విమర్శలు చేశారు. అందుకు తగ్గట్టే ఐపీఎల్ లోనూ పూర్తిగా వైఫల్యం చెందాడీ స్టార్ క్రికెటర్. దీనికి తోడు వ్యక్తిగత జీవితంలో సమస్యలు చుట్టు ముట్టాయి. దీంతో ఈ స్టార్ క్రికెటర్ ప్రపంచకప్ లో ఎలా రాణిస్తాడు? అని అభిమానులు ఆందోళన చెందారు. కానీ ఈ అనుమానాన్నింటినీ పటా పంచలు చేశాడు. స్టార్ ఆల్ రౌండర్ గా టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఈ పోరగాడు మరెవరో కాదు భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.

బంగ్లాదేశ్ తో జరిగిన సూపర్ -8 మ్యాచ్ లో ఆల్ రౌండ్ ఫెర్ఫామెన్స్ తో అదరగట్టాడు హార్దిక్. మొదట బ్యాటింగ్ లో 27 బంతుల్లోనే 50 పరుగులు సాధించాడు. ఇందులో 4 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఆ తర్వాత బౌలింగ్ లోనూ రాణించి బంగ్లా స్టార్ ఓపెనర్ లిటన్ దాస్ వికెట్ తీశాడు. తద్వారా టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం అందుకున్నాడు. మరి రాబోయే మ్యాచుల్లోనూ హార్దిక్ తన జోరు కొనసాగించాలని, టీమిండియాకు ప్రపంచకప్ అందించాలని కోరుకుందాం.

ఇవి కూడా చదవండి

భారత్ వర్సెస్ బంగ్లామ్యాచ్ హైలెట్స్..

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా హార్దిక్ పాండ్యా.,.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..