
IPL గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్ Playing XI: శనివారం జరుగుతోన్న ఐపీఎల్ రెండో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచిన ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ చేయనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. గాయం కారణంగా గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆడటం లేదు. అతని స్థానంలో రషీద్ ఖాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బలమైన జట్టుగా పరిగణిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం 15 ఏళ్ల బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఫామ్‌లో ఉండటమే. ఐపీఎల్ 2026లో తన తొలి మ్యాచ్‌లోనే వైభవ్ చెన్నైపై కేవలం 15 బంతుల్లోనే 50 పరుగులు బాదాడు. అతను 17 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 52 పరుగులు సాధించాడు.
అయితే, ఈసారి అతను కగిసో రబాడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలతో కూడిన అంతర్జాతీయ పేస్ బౌలింగ్ దళాన్ని ఎదుర్కోనున్నాడు. ఇది అతనికి ఒక పెద్ద పరీక్ష కావచ్చు.
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): కుమార్ కుషాగ్రా, సాయి సుదర్శన్, జోస్ బట్లర్(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్(కెప్టెన్), కగిసో రబడ, అశోక్ శర్మ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..