GT vs RCB Match Highlights, IPL 2022: ఉత్కంఠ పోరులో టైటాన్స్‌దే విజయం.. బెంగళూరుకు తప్పని ఓటమి..

|

Apr 30, 2022 | 7:33 PM

Gujarat Titans vs Royal Challengers Bangalore Live Score in telugu: టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 170 పరుగులు చేసింది...

GT vs RCB Match Highlights, IPL 2022: ఉత్కంఠ పోరులో టైటాన్స్‌దే విజయం.. బెంగళూరుకు తప్పని ఓటమి..
Gt Vs Rcb Ipl

Gujarat Titans vs Royal Challengers Bangalore Highlights in telugu: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య జరిగిన పోరులో చివరికి గుజరాత్‌ విజయాన్ని అందుకుంది. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి గుజరాత్‌ టైటాన్స్‌ 19.3 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. మొదట్లో వరుసగా వికెట్లు కోల్పోయినా చివర్లో డేవిడ్‌ మిల్లర్‌ (39), రాహుల్‌ (43)లు అజేయంగా నిలవడంతో గుజరాత్‌కు గెలుపు సాధ్యమైంది.

ఇక అంతకు ముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 170 పరుగులు చేసింది. గడిచిని రెండు మ్యాచ్‌ల్లో డకౌట్‌ అయ్యి నిరాశ పరిచిన కోహ్లీ ఈ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. రజత్‌ పటీదార్‌తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేశాడు. వీరిద్దరు 74 బంతుల్లో 99 పరుగులు చేసి జట్టు స్కోర్‌ పెంచారు. అయితే విరాట్‌ 58 పరుగుల వద్ద అవుట్‌ అయిన తర్వాత జట్టు స్కోరు నెమ్మదించింది. కోహ్లీ అవుట్‌ అయిన తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది.

Key Events

బలమైన జట్టుగా గుజరాత్‌..

టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్‌ టైటాన్స్‌ బలంగా ఉంది. బ్యాటింగ్‌, బౌలిం‍గ్‌ పరంగా పటిష్టం‍గా కన్పిస్తోంది.

ఆర్సీబీ బలాలు, బలహీనతలు..

ఆర్‌సీబీ బౌలింగ్‌ పరంగా రాణిస్తున్నప్పటికీ.. బ్యాటింగ్‌లో కాస్త తడబడుతోంది. విరాట్‌ కోహ్లి ఫామ్‌లో లేకపోవడం ఆ జట్టును కలవరపెడుతోంది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 30 Apr 2022 07:22 PM (IST)

    ఉత్కంఠ పోరులో టైటాన్స్‌దే విజయం..

    రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య జరిగిన పోరులో చివరికి గుజరాత్‌ విజయాన్ని అందుకుంది. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి గుజరాత్‌ టైటాన్స్‌ 19.3 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. మొదట్లో వరుసగా వికెట్లు కోల్పోయినా చివర్లో డేవిడ్‌ మిల్లర్‌ (39), రాహుల్‌ (43)లు అజేయంగా నిలవడంతో గుజరాత్‌కు గెలుపు సాధ్యమైంది.

  • 30 Apr 2022 06:46 PM (IST)

    100 పరుగులు దాటిన గుజరాత్‌ స్కోర్‌..

    గుజరాత్‌ టైటాన్స్‌ స్కోర్‌ 100 పరుగులు చేరుకుంది. 14 ఓవర్లు ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 100 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో డేవిడ్‌ మిల్లర్‌ (9), రాహుల్‌ (5) పరగుల వద్ద కొనసాగుతున్నారు. గుజరాత్ విజయానికి ఇంకా 36 బంతుల్లో 71 పరుగులు చేయాల్సి ఉంది.

  • 30 Apr 2022 06:39 PM (IST)

    4వ వికెట్ కోల్పోయిన గుజరాత్‌..

    గుజరాత్‌ మరో వికెట్‌ కోల్పోయింది. హసరంగా బౌలింగ్‌లో అర్జున్‌ రావత్‌కు క్యాచ్‌ ఇచ్చిన సాయి సుదర్శన్‌ అవుట్‌ అయ్యాడు. గుజరాత్‌ విజయానికి ఇంకా 43 బంతుల్లో 76 పరుగులు చేయాల్సి ఉంది.

  • 30 Apr 2022 06:30 PM (IST)

    మూడో వికెట్ డౌన్‌..

    గుజరాత్‌ టైటాన్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. హార్దిక్‌ పాండ్యా షాబాద్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో మహిపాల్ లోమ్రోర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

  • 30 Apr 2022 06:20 PM (IST)

    రెండో వికెట్ డౌన్‌..

    గుజరాత్‌ టైటాన్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. మంచి ఫామ్‌లో రాణిస్తోన్న శుభ్‌మన్‌ గిల్‌ 31 పరుగుల వద్ద షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.

  • 30 Apr 2022 06:12 PM (IST)

    తొలి వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌..

    గుజరాత్ తొలి వికెట్‌ను కోల్పోయింది. వృద్ధిమాన్‌ సాహా 29 పరుగుల వద్ద హసరంగా బౌలింగ్‌లో రజత్‌ పటీదార్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. రజత్‌ పటీదార్‌ అద్భుతమైన క్యాచ్‌తో ఆశ్చర్యపరిచాడు.

  • 30 Apr 2022 06:06 PM (IST)

    50 పరుగుల మార్క్‌ను చేరుకున్న గుజరాత్‌..

    బెంగళూరు ఇచ్చిన 171 పరగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌కు ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. 7 ఓవర్లు ముగిసే సమయానికి ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా 50 పరుగులు పూర్తి చేశారు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్‌ గిల్‌ (19), వృద్ధిమాన్‌ సాహా (29) పరుగులతో కొనసాగుతున్నారు.

  • 30 Apr 2022 05:24 PM (IST)

    ముగిసిన ఆర్సీబీ ఇన్నింగ్స్‌..

    టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 170 పరుగులు చేసింది. గడిచిని రెండు మ్యాచ్‌ల్లో డకౌట్‌ అయ్యి నిరాశ పరిచిన కోహ్లీ ఈ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. రజత్‌ పటీదార్‌తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేశాడు. వీరిద్దరు 74 బంతుల్లో 99 పరుగులు చేసి జట్టు స్కోర్‌ పెంచారు. అయితే విరాట్‌ 58 పరుగుల వద్ద అవుట్‌ అయిన తర్వాత జట్టు స్కోరు నెమ్మదించింది. కోహ్లీ అవుట్‌ అయిన తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. రజత్‌ పటీదార్‌ కూడా 52 పరుగులకే వెనుదిరగడంతో స్కోర్‌ బోర్డ్‌ నెమ్మదించింది. కోహ్లీ, రజత్‌ పటీదార్‌లలో ఏ ఒక్కరు క్రీజులో నిలకడగా ఉన్నా బెంగళూరు జట్టు స్కోర్‌ ఇంకా భారీగా పెరిగేది. అయితే 171 పరుగుల లక్ష్యం చిన్నది కాకపోయినప్పటికీ, ఫుల్‌ ఫామ్‌లో ఉన్న గుజరాత్‌కు మాత్రం అంత కష్టమైన లక్ష్యం కాదని చెప్పాలి. మరి బెంగళూరు ఇచ్చిన లక్ష్యాన్ని గుజరాత్‌ చేధిస్తుందో లేదో చూడాలి.

  • 30 Apr 2022 05:08 PM (IST)

    5వ వికెట్‌ కోల్పోయిన బెంగళూరు..

    బెంగళూరు వరుస వికెట్లు కోల్పోతోంది. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ అవుట్‌ అయ్యాడు. లాకీ ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాటపట్టాడు. మ్యాక్స్‌వెల్‌ కేవలం 18 బంతుల్లో 33 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే అవుట్‌ అయ్యాడు.

  • 30 Apr 2022 05:04 PM (IST)

    మరో వికెట్ డౌన్‌..

    బెంగళూరు వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. కోహ్లీ అవుట్‌ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన దినేశ్‌ కార్తీకి వెంటనే పెవిలియన్‌ బాట పట్టాడు. కేవలం 2 పరుగులు మాత్రమే చేసి రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో షమీకి క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు.

  • 30 Apr 2022 05:00 PM (IST)

    మూడో వికెట్‌ కోల్పోయిన బెంగళూరు..

    రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మరో వికెట్‌ కోల్పోయింది. 53 బంతుల్లో 58 పరుగులు చేసిన విరాట్‌ షమీ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు.

  • 30 Apr 2022 04:44 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన బెంగళూరు..

    బెంగళూరు రెండో వికెట్‌ కోల్పోయింది. మంచి ఫామ్‌తో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే రజత్‌ పటీదార్‌ అవుట్‌ అయ్యాడు. ప్రదీప్‌ సాంగ్వన్‌ బౌలింగ్‌లో శుభమన్‌గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. దీంతో కోహ్లీ, పటీదార్‌ల భాగస్వామ్యానికి తెరపడింది. వీరిద్దరి కేవలం 74 బంతుల్లోనే 99 పరుగులు సాధించి జట్టు స్కోర్‌ బోర్డ్‌ పెరగడంలో కీలక పాత్ర పోషించారు.

  • 30 Apr 2022 04:32 PM (IST)

    కోహ్లీ హాఫ్‌ సెంచరీ..

    గడిచిన రెండు మ్యాచ్‌ల్లో ఘోరంగా వైఫల్యం చెందిన విరాట్‌ గుజరాత్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో బాగా ఆడుతున్నాడు. 45 బంతుల్లో హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసే సమయానికి బెంగళూరు 2 వికెట్లు కోల్పోయి 102 పరుగుల వద్ద కొనసాగుతోంది. క్రీజులో విరాట్‌ (53), రజత్‌ పటీదార్‌ (46) పరుగుల వద్ద కొనసాగుతున్నాడు.

  • 30 Apr 2022 04:18 PM (IST)

    దంచి కొడుతోన్న విరాట్‌..

    విరాట్‌ కోహ్లీ తన జోరును కొనసాగిస్తున్నాడు. ఛాన్స్‌ దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతూ జట్టు స్కోర్‌ను పెంచేస్తున్నాడు. ఈ క్రమంలోనే కేవలం 38 బంతుల్లోనే 44 పరగులు సాధించాడు. వీటిలో నాలుగు ఫోర్లు, 1 సిక్స్‌ ఉన్నాయి. ప్రస్తుతం బెంగళూరు స్కోర్‌ 10 ఓవర్లు ముగిసే సమయానికి 75 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 30 Apr 2022 04:03 PM (IST)

    నిలదొక్కుకుంటోన్న విరాట్‌..

    గడిచి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్‌గా వెనుదిరిగిన విరాట్‌ కోహ్లీ ఈ మ్యాచ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే 21 బంతుల్లో 27 పరగులు చేశాడు. ప్రస్తుతం బెంగళూరు 6 ఓవర్లు ముగిసే సమయానికి 43 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 30 Apr 2022 03:45 PM (IST)

    తొలి వికెట్‌ కోల్పోయిన బెంగళూరు..

    రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఫాఫ్ డు ప్లెసిస్ అవుట్‌ అయ్యాడు. ప్రదీప్ సాంగ్వన్ బౌలింగ్‌లో వికెట్‌ వృద్ధిమాన్‌ సాహాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రెండో ఓవర్‌లోనే బెంగళూరు తొలి వికెట్‌ను కోల్పోయింది.

  • 30 Apr 2022 03:04 PM (IST)

    టాస్‌ గెలిచిన బెంగళూరు..

    టాస్‌ గెలిచిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తొలుత బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపింది. నిజానికి పిచ్‌ ఛేజింగ్‌కు అనుకూలిస్తుందని నిపుణులు చెప్పిన నేపథ్యంలోనూ బెంగళూరు తొలుత బ్యాటింగ్‌ చేయడం గమనార్హం. మరి బెంగళూరు తీసుకున్న ఈ నిర్ణయం ఆ జట్టుకు ఏమేర కలిసొస్తుందో చూడాలి.

  • 30 Apr 2022 02:51 PM (IST)

    కీలకంగా మారనున్న పిచ్‌..

    ముంబయిలోని బ్రబౌర్న్ పిచ్‌ బౌలింగ్‌ అనుకూలంగా ఉంటుంది. టాస్‌ గెలిచిన వారు ముందుగా బౌలింగ్ చేసే అవకాశం. పిచ్‌ ఛేజింగ్ చేసే వారికి అనుకూలిస్తుండడం, డ్యూ ప్రభావం ఉండడమే దీనికి కారణం.

Follow us on