
శుక్రవారం అహ్మదాబాద్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2023లో భాగంగా తొలి మ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ సారథి హార్దిక్.. తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ బౌలర్ షమీ అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. చెన్నై బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఓ అద్భుతమైన రికార్డ్‌ను నెలకొల్పాడు. మహ్మద్ షమీ ఐపీఎల్‌లో 100 వికెట్లు పూర్తి చేశాడు.
టోర్నమెంట్‌లో తన 94వ ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. భారత పేసర్ డెవాన్ కాన్వాయ్‌ను కళ్లు చెదిరే బౌలింగ్‌తో పెవిలియన్ చేర్చాడు. షమీ సగటు 29.19గా నిలిచింది. ఐపీఎల్‌లో 8.52 ఎకానమీని కలిగి ఉన్నాడు.
A cracking delivery to get his 1⃣0⃣0⃣th IPL wicket ??@MdShami11 picks the first wicket of #TATAIPL 2023!
Follow the match ▶️ https://t.co/61QLtsnj3J#GTvCSK pic.twitter.com/hN0qgJ2rFo
— IndianPremierLeague (@IPL) March 31, 2023
టైటాన్స్‌తో షమీకి ఇది రెండో సీజన్. షమీ 2022 మెగా వేలంలో రూ. 6.25 కోట్లు అందుకున్నాడు. అతని ప్రారంభ సీజన్‌లో 20 వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..