23 పరుగులకే 8 వికెట్లు.. నలుగురు బౌలర్ల విధ్వంసం.. చిన్న టార్గెట్ ఛేదించలేక కుప్పకూలిన బ్యాటర్లు..

|

Jun 11, 2022 | 10:27 AM

20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. లక్ష్యం చిన్నదే, లీగ్‌లో సర్రే టీం ఆడుతున్న తీరుతో ఈ మ్యాచ్‌లో తప్పక విజయం సాధిస్తుందని అనిపించింది. కానీ,

23 పరుగులకే 8 వికెట్లు.. నలుగురు బౌలర్ల విధ్వంసం.. చిన్న టార్గెట్ ఛేదించలేక కుప్పకూలిన బ్యాటర్లు..
T20 Blast
Follow us on

ఇంగ్లండ్ టీ20(T20) లీగ్ ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. తుఫాను బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్న బ్యాటర్లు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. తమ బ్యాట్‌తో మెరుపులు మెరిపిస్తూ.. జట్టును గెలిపించేందుకు రెడీ అయ్యారు. అయితే ఈసారి కథ వేరేలా ఉంది. ఈసారి బౌలర్లు తమ అద్భుత ప్రదర్శనతో బ్యాటర్లను పెవిలియన్ చేర్చి, ఓటమికి పునాదులు వేశారు. శుక్రవారం గ్లౌసెస్టర్‌షైర్, ససెక్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ అత్యధిక స్కోరింగ్ మ్యాచ్ కానే కాదు. గ్లౌసెస్టర్‌షైర్ బ్యాటింగ్‌కు దిగి భారీ స్కోరు చేయలేకపోయింది. 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. లక్ష్యం చిన్నదే, లీగ్‌లో సర్రే టీం ఆడుతున్న తీరుతో ఈ మ్యాచ్‌లో తప్పక విజయం సాధిస్తుందని అనిపించింది. కానీ, ఓ సంఘటన మొత్తం స్టోరీనే మార్చింది.

గ్లౌసెస్టర్‌షైర్ బ్యాటింగ్ కూడా ప్రత్యేకంగా లేదు. టాప్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలింది. కానీ, గ్లెన్ ఫిలిప్స్ మాత్రం జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్‌ను అందించేందుకు నడుం బిగించాడు. 53 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 66 పరుగులు చేశాడు. అతనితో పాటు కెప్టెన్ జాక్ టేలర్ 31 బంతుల్లో 46 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు.

23 పరుగులకే ఎనిమిది వికెట్లు..

ఇవి కూడా చదవండి

146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ససెక్స్‌కు శుభారంభం లభించలేదు. టిమ్ సీఫెర్ట్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. అనంతరం 10 పరుగుల వద్ద కెప్టెన్ రవి బొపారా ఔటయ్యాడు. టామ్ ఆల్సోప్ ఒక ఎండ్‌లో వేగంగా పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో అతనికి మద్దతుగా ఫిన్ హడ్సన్ ప్రెంటిస్ ఉన్నాడు. టీం స్కోరు 118 వద్ద ఔటయ్యాడు. అతను 18 పరుగులు మాత్రమే చేశాడు. ఇక్కడ నుంచి ససెక్స్ జట్టు వారి వికెట్లను కోల్పోయింది. తదుపరి 23 పరుగుల వ్యవధిలో ఎనిమిది వికెట్లను కోల్పోయింది. మొత్తంగా 141 పరుగులకు ఆలౌట్ అయింది. ఫిన్ తర్వాత ఆ జట్టు తర్వాతి వికెట్ టామ్ రూపంలో పడింది. 52 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేశాడు. ఈ ప్లేయర్ ఉన్న సమయంలో అతని జట్టు మ్యాచ్ గెలుస్తుందని అనిపించింది. కానీ, అతని నిష్క్రమణ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడం వల్ల 5 పరుగుల తేడాతో మ్యాచ్ చేజారిపోయింది.

బౌలర్ల విధ్వంసం..

గ్లౌసెస్టర్‌షైర్ తరపున డేవిడ్ పెయిన్, జాక్ చాపెల్ చెరో మూడు వికెట్లు తీశారు. డేవిడ్ 3.4 ఓవర్లలో 17 పరుగులకే ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపాడు. అదే సమయంలో, జాక్ చాపెల్ నాలుగు ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి అదే పని చేశాడు. ఇది కాకుండా టామ్ స్మిత్ మూడు ఓవర్లలో 24 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. గ్లెన్ ఫిలిప్స్, బెన్నీ హోవెల్ చెరో వికెట్ తీశారు. బెని నాలుగు ఓవర్లలో 16 పరుగులు ఇచ్చాడు. ఫిలిప్స్ మూడు ఓవర్లలో 23 పరుగులు ఇచ్చాడు.