Video: వర్త్ వర్మ వర్తు! ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే కళ్ళు చెదిరిపోయే క్యాచ్ పట్టిన కివి కుర్రోడు..

ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తొలి మ్యాచ్‌లో గ్లెన్ ఫిలిప్స్ ఒంటి చేత్తో అందుకున్న అద్భుత క్యాచ్ పాకిస్తాన్‌కు పెద్ద ఎదురు దెబ్బనిచ్చింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 321 పరుగుల లక్ష్యాన్ని చేదించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తున్న సమయంలో, రిజ్వాన్ (3) ఔటవ్వడం మ్యాచ్‌ను మార్చేసింది. న్యూజిలాండ్ 60 పరుగుల తేడాతో గెలిచి గ్రూప్-Aలో బలమైన స్థానంలో నిలిచింది. ఈ ఓటమితో, పాకిస్తాన్ ఇప్పుడు తమ తదుపరి మ్యాచ్‌లో భారత్‌ను ఓడించాల్సిన అవసరం ఏర్పడింది.

Video: వర్త్ వర్మ వర్తు! ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే కళ్ళు చెదిరిపోయే క్యాచ్ పట్టిన కివి కుర్రోడు..
Glenn Phillips

Updated on: Feb 20, 2025 | 9:23 AM

ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభ మ్యాచ్‌లోనే క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలుగించే అద్భుత క్షణం నమోదైంది. పాకిస్తాన్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న పోరులో, న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించి, పాకిస్తాన్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ మహమ్మద్ రిజ్వాన్‌ను అవుట్ చేశాడు. ఫిలిప్స్ ఒంటి చేత్తో క్యాచ్ అందుకుని, ఆటలో కీలకమైన మలుపు తిప్పాడు.

ఫిలిప్స్ వన్-హ్యాండ్ బ్లైండర్

పాకిస్తాన్ 321 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో ఉంది. అయితే, 14 బంతుల్లో కేవలం 3 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రిజ్వాన్ ఔటవ్వడం, పాకిస్తాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ అయ్యింది. విల్ ఓ’రూర్క్ వేసిన బంతిని రిజ్వాన్ స్క్వేర్ కట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ, డీప్ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న గ్లెన్ ఫిలిప్స్ చిరస్మరణీయమైన క్యాచ్ అందుకున్నాడు.

ఆ బంతి అతని నుంచి కొంత దూరంగా వెళుతుండగా, ఫిలిప్స్ అద్భుతమైన స్పందనతో గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ పట్టాడు. ఈ అద్భుతాన్ని చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యంతో అలరించారు, న్యూజిలాండ్ జట్టు సభ్యులు ఫిలిప్స్‌ను అభినందించేందుకు పరుగెత్తుకొచ్చారు.

2025 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో, పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో, న్యూజిలాండ్ 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి 320/5 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. విల్ యంగ్ (107), టామ్ లాథమ్ (118 నాటౌట్) సెంచరీలు సాధించి జట్టును బలమైన స్థితికి చేర్చారు. గ్లెన్ ఫిలిప్స్ కూడా 39 బంతుల్లో 61 పరుగులు చేసి, ఇన్నింగ్స్‌కు చివరిలో ఊపునిచ్చాడు.

పాకిస్తాన్ బౌలర్లలో నసీమ్ షా 2 వికెట్లు తీసుకోగా, మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. చేదనలో, పాకిస్తాన్ జట్టు 47.2 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌట్ అయింది. బాబర్ అజామ్ (64), ఖుష్దిల్ షా (69) హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ, జట్టు విజయం సాధించలేకపోయింది. న్యూజిలాండ్ బౌలర్లలో విల్ ఓ’రూర్క్ 3 వికెట్లు, మిచెల్ సాంట్నర్ 3 వికెట్లు తీసుకున్నారు.

ఈ మ్యాచ్‌లో గ్లెన్ ఫిలిప్స్ తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో ప్రత్యేకంగా నిలిచాడు. పాకిస్తాన్ కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్‌ను ఔట్ చేయడానికి, ఫిలిప్స్ ఒంటి చేత్తో అద్భుతమైన డైవింగ్ క్యాచ్ పట్టాడు, ఇది ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

పాకిస్తాన్ కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్, ఈ పరాజయానికి డెత్ ఓవర్లలో బౌలింగ్ లోపాలు, కీలక ఓపెనర్ ఫఖర్ జమాన్ గాయపడటం ప్రధాన కారణాలని పేర్కొన్నారు. ఫఖర్ జమాన్ గాయం కారణంగా ఓపెనింగ్‌కు రాలేకపోవడం, జట్టు బ్యాటింగ్ క్రమాన్ని దెబ్బతీసింది.

ఈ విజయంతో, న్యూజిలాండ్ గ్రూప్ ఏలో బలమైన స్థితిని పొందింది, కాగా పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో భారత్‌ను ఎదుర్కొనాల్సి ఉంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..