ఐసీసీ ప్రపంచకప్ 2019లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ గురించి ఇరు దేశాల అభిమానులే కాకుండా యావత్ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తాజాగా ఈ జాబితాలోకి ఓ ప్రత్యేక అభిమాని కూడా వచ్చి చేరిపోయాడు. అతనేవరో కాదు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్. ఈ క్రమంలో ఇరు దేశాల(భారత్-పాక్) జాతీయ జెండాల రంగులతో కూడిన షూట్‌ను ధరించి గేల్ ఫొటోలకు ఫొజులిచ్చాడు. ఒక భుజంపై భారత జెండా రంగులను, మరో భుజంపై పాకిస్థాన్ జెండా రంగులతో ప్రత్యేకంగా రూపొందించిన షూట్‌తో గేల్ చిరునవ్వులు చిందిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోను క్రికెట్ వరల్డ్‌కప్ ట్విటర్ ఖాతా ద్వారా పంచుకుంది.
కాగా వరల్డ్‌కప్‌లో శుక్రవారం ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ ఓ సరికొత్త రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. నిన్నటి మ్యాచ్‌లో గేల్(36; 41బంతుల్లో 5×4, 1×6) పరుగుల ద్వారా మొత్తం 1632పరుగులు సాధించి ఆతిథ్య జట్లపై వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా అందరికంటే ముందు వరుసలో నిలిచాడు.