Team India: వైట్ బాల్‌లో హీరో.. రెడ్ బాల్‌లో జీరో.. పరువు తీస్తున్నావ్‌గా గంభీర్..!

Gautam Gambhirs Test Tenure Under Scrutiny: మాజీ ఓపెనర్ వసీం జాఫర్ గౌతమ్ గంభీర్ టెస్ట్ కోచింగ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. స్వదేశంలో వైట్ వాష్‌లు, కీలక ఆటగాళ్ల ఎంపికలో లోపాలను హైలైట్ చేశారు. సూర్యకుమార్ యాదవ్, మహమ్మద్ షమీల పట్ల టీమిండియా అనుసరిస్తున్న విధానాన్ని తప్పుపట్టారు. గంభీర్‌తో పాటు జట్టు కూడా మారాల్సిన అవసరం ఉందని, లేదంటే డబ్ల్యూటీసీ ఆశలు దెబ్బతింటాయని జాఫర్ అభిప్రాయపడ్డారు.

Team India: వైట్ బాల్‌లో హీరో.. రెడ్ బాల్‌లో జీరో.. పరువు తీస్తున్నావ్‌గా గంభీర్..!
Ten Doeschate Gambhir

Updated on: Aug 25, 2026 | 7:58 PM

Gautam Gambhirs Test Tenure Under Scrutiny: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టెస్ట్ క్రికెట్ లో ప్రదర్శనపై మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైట్ బాల్ క్రికెట్ లో గంభీర్ విజయాలు సాధించినా, టెస్ట్ ఫార్మాట్ లో మాత్రం ఆయన చెత్తగా ఉన్నాడని జాఫర్ అభిప్రాయపడ్డాడు. కొన్ని కీలక నిర్ణయాలు, స్వదేశంలో ఎదురైన ఓటములు గంభీర్ కోచింగ్ కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపాయని ఆయన స్పష్టం చేశాడు.

జాఫర్ ముఖ్యంగా ఆటగాళ్ల ఎంపిక విషయంలో టీమిండియా అనుసరిస్తున్న విధానాన్ని తప్పుపట్టారు. కొంతమంది స్టార్ ఆటగాళ్లను “కూరలో కరివేపాకులా” తీసి పారేశాడని విమర్శించాడు. టీ20 ప్రపంచకప్ గెలిచిన వెంటనే సూర్యకుమార్ యాదవ్ ను జట్టుకు దూరం చేయడం, సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ విషయంలో అనుసరిస్తున్న విధానం సరైనది కాదని జాఫర్ అన్నాడు. ఈ నిర్ణయాలు జట్టు సమతుల్యతను దెబ్బతీశాయని ఆయన సూచించాడు.

ఎక్కువమంది చదివినది: SL vs IND: కొలంబోలో భారీ విక్టరీ దిశగా భారత్.. WTC టేబు‌లో భారీ జంప్..?

ఇవి కూడా చదవండి

గౌతమ్ గంభీర్ కెరీర్ లో అతిపెద్ద మచ్చగా జాఫర్ రెండు టెస్ట్ వైట్ వాష్‌లను ప్రస్తావించాడు. స్వదేశంలో బలహీన జట్లపై కూడా టీమిండియా ఆధిపత్యం చలాయిస్తుంది. అలాంటిది న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో వరుసగా వైట్ వాష్‌లు ఎదురవ్వడం తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆయన పేర్కొన్నాడు. ఈ ఓటముల వల్ల టీమిండియా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కోల్పోవాల్సి వచ్చిందని, ఇది డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుకోవడంలో వైఫల్యానికి దారితీసిందని జాఫర్ ఆందోళన వ్యక్తం చేశాడు.

సెలక్షన్ విషయంలో జరిగే తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సి వస్తుందని జాఫర్ స్పష్టం చేశాడు. విదేశీ జట్లకు టీమిండియాను స్వదేశంలో ఓడించడం అంత సులువు కాదని, అలాంటిది రెండు వైట్ వాష్‌లు ఎదుర్కొనడం దారుణమని ఆయన పునరుద్ఘాటించాడు. ఒకవేళ ఆ సిరీస్ లు గెలిచి ఉంటే భారత్ డబ్ల్యూటీసీ పట్టికలో అగ్రస్థానంలో ఉండేదని ఆయన గుర్తు చేశాడు.

శ్రీలంక పర్యటన నేపథ్యంలో జాఫర్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గౌతమ్ గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025, టీ20 ప్రపంచకప్ 2026 టైటిళ్లను గెలిచినప్పటికీ, డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ కు చేరుకోలేకపోవడం ఆందోళన కలిగించే విషయమని జాఫర్ పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినది: Video: 0,W,4,0,W,0.. ఒకే ఓవర్లో 2 వికెట్లతో చెలరేగిన బుడ్డోడు.. సెలబ్రేషన్స్ చూస్తే ఫిదానే..!

టెస్ట్ కోచ్ గా గంభీర్ ఇంకా మెరుగుపడాలని, కేవలం అతనొక్కడే కాదు, జట్టు కూడా మారాల్సిన అవసరం ఉందని జాఫర్ నొక్కి చెప్పారు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భారత్ తొలి మ్యాచ్ ను 165 పరుగుల తేడాతో గెలిచింది. రెండో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడంపై దృష్టి సారించింది. ఈ సమయంలో గంభీర్ పనితీరుపై జాఫర్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మెరుగైన ప్రదర్శనతో పాటు, సరైన ఆటగాళ్ల ఎంపికతోనే జట్టు భవిష్యత్తు ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us