Video: వెంకన్న సన్నిధిలో టీమిండియా హెడ్‌కోచ్.. టెస్ట్ సిరీస్ విజయం కోసం ప్రత్యేక పూజలు

Gautam Gambhir: ఇంగ్లాండ్ సిరీస్ గెలవడం గౌతమ్ గంభీర్‌కు చాలా ముఖ్యం. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజ ఆటగాళ్లు లేనప్పుడు.. విదేశంలో టెస్ట్ సిరీస్ గెలవడం ఎంతో ముఖ్యం. ఇటువంటి పరిస్థితిలో, ఈ ఇద్దరి స్థానాన్ని భర్తీ చేయడం గంభీర్‌కు అతిపెద్ద సవాలుగా మారుతుంది.

Video: వెంకన్న సన్నిధిలో టీమిండియా హెడ్‌కోచ్.. టెస్ట్ సిరీస్ విజయం కోసం ప్రత్యేక పూజలు
Gautam Gambhir

Edited By:

Updated on: May 18, 2025 | 1:40 PM

Gautam Gambhir Visited Tirupati: తిరుమల కొండపై సామాన్య భక్తుల రద్దీనే కాదు క్రికెటర్ల సందడి కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలో శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చే క్రికెటర్ల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు ఆ తర్వాత క్రికెటర్లు పెద్ద ఎత్తున వెంకన్న ఆశీస్సుల కోసం తిరుమలకు క్యూ కడుతున్నారు. స్టార్ క్రికెటర్లతో పాటు ఐపీఎల్ ఆటగాళ్లు, కోచ్ లు, ఫ్రాంచేజీ ఓనర్లు కూడా తిరుమలకు రావడం ప్రత్యేకత గా మారింది. ఇక టీం ఇండియా ఆటగాళ్ళ గురించి మాట్లాడితే, ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉన్నారు. కానీ, ఐపీఎల్ తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. భారత జట్టు జూన్‌లో ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత జట్టు గెలవడం చాలా ముఖ్యం. ఎందుకంటే భారత జట్టు గత 2 సిరీస్‌లను చాలా దారుణంగా ఓడిపోయింది. అలాగే, డబ్ల్యూటీసీ కొత్త సైకిల్ కూడా ఈ సిరీస్‌తోనే మొదలుకానుంది. దీంతో ఈ సిరీస్‌పైనే అందరి ఫోకస్ పెరిగింది.

ముఖ్యంగా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కి, ఇంగ్లాండ్ సిరీస్ గెలవడం అంటే, అతని ప్రతిష్టను కాపాడుకోవడంతో సమానం. సిరీస్ ప్రారంభానికి కొన్ని నెలల ముందు, ప్రధాన కోచ్ ఇప్పుడు భగవంతుని ఆశీస్సులు పొందేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించాడు.

ఇవి కూడా చదవండి

కుటుంబంతో కలిసి తిరుపతి చేరుకున్న గౌతమ్ గంభీర్..

కొన్ని రోజుల క్రితం గౌతమ్ గంభీర్ తన భార్య, కుమార్తెలతో కలిసి దేవదేవున్ని దర్శనం చేసుకున్నారు. దీనికి ముందు, రాజస్థాన్‌లోని ఖాతు శ్యామ్ ఆలయంలో ప్రార్థనలు చేస్తూ కనిపించాడు గౌతమ్ గంభీర్. ఆ తరువాత, ఇప్పుడు ఆయన తన కుటుంబంతో కలిసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఈ మేరకు గంభీర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఏపీకి చెందిన ఐపిఎల్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి శ్రీవారిని దర్శించు కోగా ఆర్సీబీ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్, జితేష్ శర్మ, ఉమెన్ క్రికెటర్ శ్రేయాంక పాటిల్, పంజాబ్ జట్టు ఓనర్ ప్రీతిజింటా, లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయింక కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

గౌతమ్ గంభీర్ వీడియో..

గౌతమ్ గంభీర్ గురించి మాట్లాడుకుంటే, అతను కోచింగ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి టీం ఇండియా టెస్ట్ క్రికెట్‌లో పెద్దగా విజయం సాధించలేదు. భారత జట్టు పేరుతో ఎన్నో చెడ్డ రికార్డులు నమోదయ్యాయి. ఇందులో 12 సంవత్సరాల తర్వాత స్వదేశంలో టెస్ట్ సిరీస్ కోల్పోయిన రికార్డు కూడా ఉంది.

రోహిత్ విరాట్ స్థానాన్ని భర్తీ చేయడమే గౌతమ్ గంభీర్ టార్గెట్..

అందుకే ఇంగ్లాండ్ సిరీస్ గెలవడం గౌతమ్ గంభీర్‌కు చాలా ముఖ్యం. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజ ఆటగాళ్లు లేనప్పుడు.. విదేశంలో టెస్ట్ సిరీస్ గెలవడం ఎంతో ముఖ్యం. ఇటువంటి పరిస్థితిలో, అతని స్థానాన్ని భర్తీ చేయడం గంభీర్‌కు అతిపెద్ద సవాలుగా మారింది.