డ్రెస్సింగ్‌ రూమ్‌లో విరాట్‌ కోహ్లీపై గౌతమ్‌ గంభీర్‌ సీరియస్! సోషల్‌ మీడియాలో ఫొటోలు వైరల్‌

2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో టీమిండియా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. సెమీఫైనల్‌లో కోహ్లీ 84 పరుగులు చేశాడు కానీ సెంచరీ మిస్ అయ్యాడు. అతని షాట్‌పై కోచ్ గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశారని, తరువాత ప్రశంసించారని వార్తలు వచ్చాయి. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

డ్రెస్సింగ్‌ రూమ్‌లో విరాట్‌ కోహ్లీపై గౌతమ్‌ గంభీర్‌ సీరియస్! సోషల్‌ మీడియాలో ఫొటోలు వైరల్‌
Virat Kohli Gautam Gambhir

Updated on: Mar 06, 2025 | 8:25 AM

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా, న్యూజిలాండ్‌ జట్లు ఫైనల్‌లో తలపడనున్నాయి. ఈ నెల 9న ఈ రెండు జట్లు దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో టైటిల్‌ కోసం పోటీ పడతాయి. తొలి సెమీస్‌లో ఆసీస్‌పై టీమిండియా, రెండో సెమీస్‌లో సౌతాఫ్రికాపై న్యూజిలాండ్‌ జట్లు గెలిచి ఫైనల్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్‌తో 84 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఆ మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, విరాట్‌ కోహ్లీపై అసహనం వ్యక్తం చేసినట్లు కొన్ని ఫొటోలు ఇప్పుడు బయటికి చవ్చాయి. అవి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆ మ్యాచ్‌లో విరాట్‌ 84 పరుగులతో సెంచరీకి చేరువలో ఉన్నాడు, మరోవైపు టీమిండియా కూడా విజయానికి చేరువై కంఫర్ట్‌బుల్‌ పొజిషన్‌లో ఉంది.

దీంతో కోహ్లీ వన్డేల్లో తన 52వ సెంచరీని అందుకుంటాడని అంతా భావించారు. కానీ క్రికెట్ ప్రపంచం విరాట్ కోహ్లీ సెంచరీ చూసే సువర్ణావకాశాన్ని కోల్పోయింది. సెంచరీకి చేరుకునే దశలో కోహ్లీ, ఆడమ్ జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో అవుట్‌ అయ్యాడు. ఈ షాట్‌ కారణంగా గంభీర్‌, కోహ్లీపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అప్పటికే అదే ఓవర్‌లో కేఎల్‌ రాహుల్‌ ఓ భారీ సిక్స్‌ కొట్టాడు. ఆ ఓవర్‌లో రావాల్సిన స్కోర్‌ వచ్చేసింది. అయినా కూడా ఎందుకు అనవసరంగా ఆ షాట్‌ ఆడావంటూ కోహ్లీపై గంభీర్‌ కాస్త సీరియస్‌ అయినట్లు సమాచారం. అవుట్‌ అయిన తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వచ్చిన విరాట్‌ కోహ్లీతో గంభీర్‌ అతని షాట్‌ గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది.

“మార్ తో రహా థా వో( కేఎల్ రాహుల్ కొడుతున్నాడు కదా..) అని గంభీర్ కోహ్లీతో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇది జరిగిన తర్వాత మీడియాతో మాట్లాడిన గంభీర్‌, కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. “అతను ఒక అద్భుతమైన వన్డే క్రికెటర్. అతను తన పరుగులను ఎలా ప్లాన్ చేసుకోవాలో అతనికి తెలుసు, అతను ముందుగా బ్యాటింగ్ చేస్తున్నాడా లేదా ఛేజింగ్ చేస్తున్నాడా అనేది అతనికి తెలుసు. కోహ్లీ మ్యాచ్‌ కండీషన్స్‌కు త్వరగా అలవాటు పడతాడు. అతనికి ఉన్న అనుభవం, క్వాలిటీ బ్యాటింగ్‌ ఎంతో ముఖ్యమైనవి. వన్డే క్రికెట్‌లో మరిన్ని రికార్డులు అతను సాధించాలని ఆశిస్తున్నాను.” అని గంభీర్ మంగళవారం మ్యాచ్ తర్వాత మీడియాతో అన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..