Gambhir: మామూలోడివి కాదు సామీ.. టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ శాలరీ ఎంతో తెలిస్తే

|

Jul 11, 2024 | 6:34 PM

టీమిండియాకి కొత్త కోచ్ వచ్చేసిన సంగతి తెలిసిందే. రాహుల్ ద్రావిడ్ వారసుడిగా గౌతమ్ గంభీర్.. హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే ఇప్పుడు గంభీర్ తీసుకోబోయే వేతనం.. ఆ వివరాలు ఇలా..

Gambhir: మామూలోడివి కాదు సామీ.. టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ శాలరీ ఎంతో తెలిస్తే
Gautam Gambhir
Follow us on

భారత క్రికెట్‌లో కొత్త శకం. టీ20లకు విరాట్, రోహిత్, జడేజా రిటైర్మెంట్ ప్రకటించగా.. రాహుల్ ద్రావిడ్ స్థానంలో కొత్త హెడ్ కోచ్.. అండ్ నూతన స్టాఫ్ రాబోతున్నారు. కొద్దిరోజుల క్రితమే బీసీసీఐ సెక్రెటరీ జైషా టీమిండియాకి కొత్త కోచ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. రాహుల్ ద్రావిడ్ వారసుడిగా గౌతమ్ గంభీర్.. హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే ఇప్పుడు గంభీర్ తీసుకోబోయే వేతనం గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికైతే గంభీర్‌కు ఇచ్చే వార్షిక వేతనాన్ని బీసీసీఐ ఇంకా నిర్ణయించలేదు.

ఇది చదవండి: నిద్రపోయే భంగిమను బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చు..! ఎలాగో తెల్సా

2014లో డంకన్ ఫ్లెచర్ టీమిండియా ప్రధాన కోచ్ పదవి నుంచి వైదొలగడంతో రవిశాస్త్రి కూడా ఒప్పందం లేకుండానే కోచ్ పదవిని చేపట్టాడు. ఇక ఇప్పుడు గౌతమ్ గంభీర్ కూడా జీతం ఫిక్స్ కాకుండానే.. కోచ్ పదవికి ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. అయితే గత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు వార్షిక వేతనంగా రూ. 12 కోట్లు చెల్లించింది బీసీసీఐ. కానీ గౌతమ్ గంభీర్‌కు ఏకంగా ఏడాదికి రూ. 25 కోట్లు చెల్లిస్తుందని టాక్. ఎందుకంటే.. కేకేఆర్‌గా మెంటార్‌గా ఉన్న గంభీర్.. ఐపీఎల్ 2024కి రూ. 25 కోట్లు అందుకున్నాడు. ఇక అదే శాలరీ బీసీసీఐ కూడా చెల్లిస్తుందని సమాచారం.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ‘హాయ్ ఫ్రెండ్స్.! ఈరోజు మా ఫస్ట్ నైట్’.. వీడియో షేర్ చేసిన కొత్త జంట.. ఇదేం బూతు పురాణం

మరోవైపు జింబాబ్వేతో సిరీస్‌లో టీమిండియా తాత్కాలిక కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తున్నాడు. ఈ సిరీస్ తర్వాత భారత జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. అంటే శ్రీలంక సిరీస్‌తో టీమిండియా కోచ్‌గా గౌతమ్ గంభీర్ కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తాడు. ఈ సిరీస్‌లో భారత జట్టు 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. అయితే గంభీర్ ఫస్ట్ కోచింగ్ టూర్‌కి రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండరు. శ్రీలంకతో జరిగిన సిరీస్ నుంచి ముగ్గురు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి లభించడంతో వన్డే జట్టుకు కేఎల్ రాహుల్, టీ20 జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించే ఛాన్స్ ఉంది.

ఇది చదవండి: ఆడది కాదు.. ఆడపులి.! ఒంటిచేత్తో భారీ కొండచిలువను ఎలా ఉడుంపట్టు పట్టిందో చూస్తే

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..