కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నుంచి ఫ్యాన్స్ ఏది ఆశించారో..? అదే ఫస్ట్ టీ20 మ్యాచ్‌లో కళ్లకు కట్టినట్టు కనిపించింది. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో టీమిండియా దూకుడైన ఆటతీరును ప్రదర్శించింది. ఫలితంగా భారత్ బ్యాట్స్‌మెన్లలో ఒక్కరు కూడా 33 బంతులు దాటి ఆడకపోయినా.. లంకేయులపై అద్భుత విజయం లభించింది. భారత బ్యాటర్ల పేలుడు ఇన్నింగ్స్‌లు.. వారి బ్యాటింగ్ స్ట్రైక్‌రేట్‌పై కొట్టొచ్చినట్లు కనిపించింది. లంకతో జరిగిన తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. భారత బ్యాటింగ్‌లో రెండు కీలక విషయాలు హైలైట్‌గా నిలిచాయి. ఒకటి భారత బ్యాట్స్‌మెన్లు ఎదుర్కొన్న బంతులు కాగా, రెండోది స్ట్రైక్‌రేట్. రెండింటిలోనూ, గౌతమ్ గంభీర్ మార్క్ కనిపించిందని చెప్పొచ్చు.
శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ఏ భారత బ్యాట్స్‌మెన్ కూడా 33 బంతులకు మించి ఆడలేదు. గరిష్టంగా 33 బంతులు ఆడిన రిషబ్ పంత్ 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 49 పరుగులు చేశాడు. యశస్వి 21 బంతుల్లో 40 పరుగులు చేశాడు. శుభ్‌మాన్ 16 బంతుల్లో 34 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 58 పరుగులు చేయగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్లు 10 లేదా అంతకంటే తక్కువ బంతులు మాత్రమే ఆడారు.
భారత బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అత్యధిక స్ట్రైక్ రేట్ 223.07. అతడి తర్వాత శుభ్‌మాన్ గిల్ 212.50 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. యశస్వి జైస్వాల్ 190.47 స్ట్రైక్ రేట్‌తో.. పంత్ 148.48 స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టారు.
హెడ్ కోచ్ గంభీర్ దూకుడు బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ కనిపించింది. ఒకానొక సమయంలో 214 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక 14 ఓవర్లలో కేవలం 1 వికెట్ నష్టానికి 140 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత చివరి 5.2 ఓవర్లలో కేవలం 30 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. దీన్ని బట్టే చెప్పొచ్చు.. భారత బౌలర్లు ఏమేరకు సెకండాఫ్‌లో గేర్ మార్చారో..? ఈ మ్యాచ్‌లో భారత్ 43 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
ఇది చదవండి: ప్రైవేట్ పార్టులో నొప్పంటూ ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. ఎక్స్‌రే తీసి చూడగా కళ్లు బైర్లు
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..