Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలోనే చెత్త జట్లు ఇవే.. అత్యంత చెత్త రికార్డ్ ఎవరిదంటే?

Champions Trophy Records: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ఇంగ్లండ్, పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు ట్రోర్నీ నుంచి తప్పుకున్నాయి. మరోవైపు భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు సెమీస్ చేరుకున్నాయి. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలో ఒక్క మ్యాచ్ గెలవకుండానే ట్రోర్నీ నుంచి తప్పుకున్న జట్లు కూడా ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలోనే చెత్త జట్లు ఇవే.. అత్యంత చెత్త రికార్డ్ ఎవరిదంటే?
Icc Champions Trophy 2025 Format

Updated on: Mar 02, 2025 | 11:40 AM

Champions Trophy Records: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పుడు ఈ టోర్నమెంట్‌లో కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత ఛాంపియన్ పేరు త్వరలో తెలివనుంది. కానీ, 2019లో వన్డే ప్రపంచ కప్ గెలిచిన ఇంగ్లాండ్ చాలా పేలవమైన ప్రదర్శన చేసింది. ఇంగ్లాండ్ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయారు. తొలి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియా తమపై 350 కంటే ఎక్కువ లక్ష్యాన్ని సులభంగా సాధించింది. ఆ తర్వాత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ వారిని ఎనిమిది పరుగుల తేడాతో ఓడించింది. మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడం ద్వారా, ఇంగ్లాండ్ తన పేరిట అవమానకరమైన రికార్డును నమోదు చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని మ్యాచ్‌ల్లో ఓడిపోయిన నాలుగో జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. మిగతా మూడు జట్లను పరిశీలిద్దాం.

3 జింబాబ్వే – 2006: భారతదేశంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2006లో, జింబాబ్వే తొలి మ్యాచ్‌లోనే వెస్టిండీస్ చేతిలో తొమ్మిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు కేవలం 85 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత, తదుపరి మ్యాచ్‌లో శ్రీలంక వారిని 144 పరుగుల తేడాతో ఓడించగా, చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 101 పరుగుల తేడాతో వారిని ఓడించింది. శ్రీలంకపై 286 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వారు 141 పరుగులకే ఆలౌట్ అయ్యారు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వారికి 232 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. కానీ, ఆ జట్టు 130 పరుగులు మాత్రమే చేయగలిగారు.

2 వెస్టిండీస్ – 2009: దక్షిణాఫ్రికాలో జరిగిన 2009 ఛాంపియన్స్ ట్రోఫీలో వెస్టిండీస్ నిరాశపరిచిన ప్రదర్శన చేసింది. ఆ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ వారిని ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. రెండవ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆ జట్టును 50 పరుగుల తేడాతో ఓడించింది. ఇక చివరి మ్యాచ్ భారత్‌తో జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

1 పాకిస్తాన్ – 2013: ఇంగ్లాండ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2013లో కూడా పాకిస్తాన్ తన విజయ ఖాతాను తెరవలేకపోయింది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 235 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా కాపాడుకుంది. 67 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది.

పాకిస్తాన్ చివరి మ్యాచ్ భారత్‌తో జరిగింది. వర్షం కారణంగా ఆటంకం ఏర్పడిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనికి సమాధానంగా, భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..