IND vs AUS: కోహ్లీ నుంచి జురెల్ వరకు.. ఆస్ట్రేలియాలో విఫలమైన భారత బ్యాటర్లు.. అత్యంత చెత్త ప్రదర్శన

Ind vs Aus Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి సిద్ధమైంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా చేరిన భారత జట్టు కసరత్తులు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో అచ్చం మ్యాచ్‌లాగే ఉండే పరిస్థితుల్లో భారత్ ఏ జట్టుతో తలపడింది. అయితే, అనుకున్నట్లుగా భారత ఆటగాళ్లు మరోసారి విఫలం అయ్యారు.

IND vs AUS: కోహ్లీ నుంచి జురెల్ వరకు.. ఆస్ట్రేలియాలో విఫలమైన భారత బ్యాటర్లు.. అత్యంత చెత్త ప్రదర్శన
Ind Vs Aus Vs Sa

Updated on: Nov 15, 2024 | 11:17 AM

Ind vs Aus Border Gavaskar Trophy: భారత క్రికెట్ జట్టు నవంబర్ 15 నుంచి పెర్త్‌లో ఓ ప్రాక్టీస్ మ్యాచ్(నిజమైన మ్యాచ్ వంటి పరిస్థితులు) ద్వారా ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు ముందు సిద్ధమవుతోంది. ఇందులో భారత బ్యాట్స్‌మెన్స్ తేలిపోయారు. పెర్త్‌లోని ఫాస్ట్, బౌన్సీ పిచ్‌పై భారత్‌లోని ప్రముఖ బ్యాట్స్‌మెన్స్ అందరూ విఫలమయ్యారు. ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ, నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో కీలక భారత్ బ్యాటర్స్ వికెట్లు కోల్పోయారు. పెర్త్‌లో జరగనున్న తొలి టెస్టుకు సన్నద్ధం కావడానికి, భారత జట్టు భారత్ ఎతో మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌కు బదులుగా మ్యాచ్ అనుకరణకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో విరాట్‌ కోహ్లి, శుభ్‌మన్‌ గిల్‌, రిషబ్‌ పంత్‌, యశస్వి జైస్వాల్‌, ధ్రువ్‌ జురెల్‌ పెవిలియన్ చేరారు. కాగా కేఎల్ రాహుల్ గాయపడ్డాడు.

పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న డబ్ల్యూఏసీఏలో భారత జట్టు ప్రాక్టీస్ చేస్తోంది. ఇందులోభాగంగా జైస్వాల్‌, రాహుల్‌లు ఓపెనింగ్‌కు వచ్చారు. అయితే బౌన్స్‌ బంతికి రాహుల్‌ గాయపడడంతో బ్యాటింగ్‌ చేయకుండానే నిష్క్రమించాల్సి వచ్చింది. రాహుల్ మొదట ఫిజియో సహాయం తీసుకున్నా అతని నొప్పి తగ్గలేదు. అతని మోచేతి దగ్గర బంతి తగిలింది.

శుభారంభం తర్వాత జైస్వాల్-కోహ్లీ దూకుడు..

జైస్వాల్ జోరుమీద కనిపించాడు. తొలి ఓవర్‌లోనే ఫోర్ కొట్టాడు. కానీ ఫుల్ లెంగ్త్ బంతిని ఆడి వికెట్ వెనుక క్యాచ్ ఇచ్చాడు. జైస్వాల్ 15 పరుగులు మాత్రమే చేశాడు. అతడిని నవదీప్ సైనీ అవుట్ చేశాడు. విరాట్ కోహ్లికి కూడా ఆరంభంలో బౌన్స్, స్పీడ్‌తో ఇబ్బంది కలగలేదు. రెండు అద్భుతమైన షాట్లు ఆడి ఫోర్లు సాధించాడు. కానీ స్కోరు 15 వద్ద, అతను ముఖేష్ కుమార్ ఆఫ్ స్టంప్ వెలుపల దొరికిన బంతిని ఆడుతుండగా రెండవ స్లిప్ వద్ద క్యాచ్ ఔట్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

రిషబ్ పంత్ తనదైన శైలిలో ఆడడం ప్రారంభించాడు. అతను దూకుడు వైఖరితో వచ్చాడు. కానీ, షార్ట్ ఆఫ్ లెంగ్త్ బంతుల ముందు తడబడుతూ కనిపించాడు. చివరకు 19 పరుగుల వద్ద నితీష్‌రెడ్డి బౌలింగ్‌లో అవుటయ్యాడు. శుభ్‌మన్‌, జురెల్‌లు కూడా క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. అయితే అతను ఎన్ని పరుగులు చేశాడు, ఎవరు ఔట్ చేశారనే దానిపై స్పష్టత లేదు. అయితే, పెర్త్ మైదానంలో సాధారణంగా వికెట్లు పడే విధంగా భారత బ్యాట్స్‌మెన్స్ ఔటయ్యారు. ఆప్టస్ స్టేడియంలో బౌలర్లు బౌన్స్ ద్వారా విజయం సాధిస్తారని మరోసారి రుజువైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..