భారత్‌తో మ్యాచ్ పాక్ బహిష్కరణ నుంచి సైమండ్స్ స్కాండల్ వరకు.. టీ20 ప్రపంచకప్ హిస్టరీలో 5 వివాదాలు ఇవే?

T20 World Cup Controversy: 2026 టీ20 ప్రపంచ కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ పై వివాదం నెలకొంది. ఈ మ్యాచ్ ఆడమంటూ పాకిస్తాన్ క్రికెట్ ప్రకటించింది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ హిస్టరీలో ఇప్పటి వరకు నెలకొన్ని వివాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

భారత్‌తో మ్యాచ్ పాక్ బహిష్కరణ నుంచి సైమండ్స్ స్కాండల్ వరకు.. టీ20 ప్రపంచకప్ హిస్టరీలో 5 వివాదాలు ఇవే?
T20 World Cup Controversy

Updated on: Feb 05, 2026 | 12:30 PM

T20 World Cup Controversy: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ఫిబ్రవరి 7న మొదలుకానుంది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్న ఈ మెగా ఈవెంట్ సందడి మొదలైంది. ఇప్పటికే అన్ని దేశాల టీంలు ప్రాక్టీస్ మ్యాచ్‌లతో బిజీగా ఉన్నాయి. అయితే, ఐసీసీ ఈవెంట్లలో కొన్ని వివాదాలు కూడా సంచలనంగా మారాయి. తాజాగా టీ20 ప్రపంచకప్ 2026లోనూ రెండు వివాదాలు నడుస్తున్నాయి. బంగ్లాదేశ్ తర్వాత, పాకిస్తాన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పాక్ జట్టు టీమిండియాతో మ్యాచ్‌ ఆడమంటూ తేల్చిచెప్పింది. టోర్నమెంట్ చరిత్రలో చెలరేగిన వివాదాలను ఓసారి తెలుసుకుందాం..

2009 ఆండ్రూ సైమండ్స్ కుంభకోణం..

ఆస్ట్రేలియా జట్టు ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ వివాదాల గురించి చెప్పాల్సిన పనిలేదు. పెద్దమనుషుల ఆటగా పేరుగాంచిన క్రికెట్‌లో సైమండ్స్ “బ్యాడ్ ప్లేయర్” గా నిలిచాడు. అతను క్రికెట్ ఆస్ట్రేలియా నియమాలను అస్సలు పాటించలేదు. 2009 ప్రపంచ కప్ సమయంలో, సైమండ్స్ ఒక ఇంగ్లీష్ క్లబ్‌లో విపరీతంగా మద్యం సేవించి, మరుసటి రోజు ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నాడు. తత్ఫలితంగా, బోర్డు అతన్ని జట్టు నుంచి తొలగించింది. అతని స్థానంలో కామెరాన్ వైట్‌ను నియమించింది.

2009 టీ20 ప్రపంచ కప్‌ నుంచి జింబాబ్వే ఔట్..

2009 టీ20 ప్రపంచ కప్ ఇంగ్లాండ్‌లో జరగాల్సి ఉంది. జింబాబ్వే టీం ఈ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. అయితే, ఇంగ్లండ్ ప్రభుత్వం, జింబాబ్వే ముగాబే ప్రభుత్వం మధ్య సంబంధాలు చెడిపోయాయి. తత్ఫలితంగా, జింబాబ్వే ఆటగాళ్లకు వీసాలు మంజూరు చేయడానికి ఇంగ్లాండ్ అడ్డు చెప్పింది. ఐసీసీ మధ్యస్థంగా, జింబాబ్వే జట్టుకు పూర్తి భాగస్వామ్య ఫీజులను చెల్లించింది. కానీ జింబాబ్వే జట్టు పాల్గొనలేదు. జింబాబ్వే స్థానంలో ఆడటానికి స్కాట్లాండ్ జట్టును ఎంపిక చేశారు.

2021లో క్వింటన్ డి కాక్ వివాదం..

దక్షిణాఫ్రికా ఓపెనింగ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ క్వింటన్ డి కాక్, బ్లాక్ లైవ్స్ మేటర్ ఉద్యమంలో భాగంగా మ్యాచ్ ముందు మోకరిల్లడానికి నిరాకరించాడు. తత్ఫలితంగా, అతను వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ నుంచి తొలగించబడ్డాడు. తరువాత డి కాక్ క్షమాపణలు చెప్పి జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.

టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి బంగ్లాదేశ్ ఔట్..

బంగ్లాదేశ్ ఐసీసీలో పూర్తి సభ్యదేశంగా ఉంది. 2026 టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనే 20 జట్లలో ఒకటి. అయితే, బీసీసీఐ బంగ్లాదేశ్‌కు చెందిన ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ 2026 సీజన్ నుంచి తొలగించింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయంతో భారతదేశంలో జరగనున్న 2026 టీ20 ప్రపంచ కప్‌నకు తమ ఆటగాళ్లను పంపడానికి నిరాకరించింది. తత్ఫలితంగా, ఐసీసీ బంగ్లాదేశ్‌ను ప్రపంచ కప్ నుంచి తొలగించింది. స్కాట్లాండ్‌ జట్టును చేర్చింది.

భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ బహిష్కరణ..

బంగ్లాదేశ్ జట్టు తొలగింపుపై పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 15న భారత్‌తో జరగనున్న మ్యాచ్‌ను బహిష్కరించాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఐసీసీ పాకిస్తాన్ తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గాలని హెచ్చరించింది. పాకిస్తాన్ అలా చేయకపోతే, ఆ దేశ క్రికెట్ భవిష్యత్తు ప్రమాదంలో పడవచ్చు అని తెలుస్తోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి