IPL 2023 Playoffs: SRH బాటలో CSK.. 19సార్లు అవే తప్పులు.. ప్లేఆఫ్ రేసు నుంచి ఔట్?

|

May 16, 2023 | 5:47 PM

Most Catch Drop in IPL 2023: IPL 2023లో సన్‌రైజర్స్ 19 క్యాచ్‌లను వదిలేసింది. దీంతో లీగ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అంటే ప్లేఆఫ్‌లో ఆడలేరు. CSK కూడా ఇప్పటి వరకు 19 క్యాచ్‌లను మిస్ చేసింది.

IPL 2023 Playoffs: SRH బాటలో CSK.. 19సార్లు అవే తప్పులు.. ప్లేఆఫ్ రేసు నుంచి ఔట్?
Csk Srh Ipl Playoffs
Follow us on

గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. అయితే ఈ మ్యాచ్‌లో పేలవమైన ఆట కారణంగా లీగ్ నుంచి నిష్క్రమణ చేసింది. హైదరాబాద్ టోర్నమెంట్ అంతటా పదేపదే చేసిన తప్పులే చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ తప్పు చేయడంలో చెన్నై సూపర్ కింగ్స్ కూడా SRH కంటే ముందుంటుంది. అంటే, SRH అవుట్ అయినట్లే, CSK కూడా లీగ్ నుంచి తప్పుకోనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పుడు పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ స్థానం మెరుగ్గా ఉందని అంతా అనుకుంటున్నారు. అయితే చెన్నై టీం ఎలా ఔట్ అవుతుంది? అనేది చూద్దాం.. పరిస్థితి మెరుగుపడిందంటే చెన్నైకి ప్లేఆఫ్ టిక్కెట్ వచ్చిందని కాదు. ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే ఈ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించాలి. ఈ మ్యాచ్‌లో SRH లాంటి తప్పులు చేయకుండా ఉంటేనే సేఫ్ జోన్‌లో ఉంటారు.

CSK ఇప్పటివరకు 19 తప్పులు చేసింది..

సన్‌రైజర్స్ హైదరాబాద్ లాగా పసుపు జెర్సీతో చెన్నై సూపర్ కింగ్స్ ఎలాంటి పొరపాట్లు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి క్రికెట్‌లో నేరంగా పరిగణించబడే పొరపాట్లన్నమాట. ఇలా చేయడం, అది కూడా మళ్లీ మళ్లీ చేయడం ఓటమికి సంకేతం. ఇక ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు 19 సార్లు ఆ తప్పు చేసింది.

ఇవి కూడా చదవండి

SRH కూడా 19 క్యాచ్‌లను వదిలేసింది..

మేం మాట్లాడుతున్న పొరపాటు మరెంటో కాదు.. క్యాచ్ డ్రాప్స్. ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ 19 క్యాచ్‌లను వదులుకోవడంతో లీగ్‌కు దూరంగా ఉంది. అంటే ప్లేఆఫ్‌లో ఆడడంలేదు. CSK కూడా ఇప్పటివరకు 19 క్యాచ్‌లను వదులుకుంది. ఇప్పటికీ ఇంకా మెరుగుపడకపోతే, ప్లేఆఫ్‌లకు దూరంగా ఉండడం పక్కా అని తెలుస్తుంది.

GT 17 క్యాచ్‌లు మిస్, RCB-MI 14 క్యాచ్‌లు డ్రాప్..

సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మినహా , గుజరాత్ టైటాన్స్ అత్యధిక క్యాచ్ డ్రాప్‌ల వరుసలో మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 17 సార్లు గుజరాత్ ఆటగాళ్లు క్యాచ్‌లు మిస్ చేశారు. అయితే, ప్లేఆఫ్ టిక్కెట్‌ను దక్కించుకున్నందున ఈ జట్టు ఈ పొరపాటు ప్రమాదాన్ని భరించాల్సిన అవసరం లేదు. గుజరాత్ టైటాన్స్ తర్వాత, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ తలో14 క్యాచ్‌లను వదులుకున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..