టీమిండియాకు 440 వోల్ట్‌ల షాక్.. టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి ఇద్దరు డేంజరస్ ప్లేయర్స్ ఔట్..

T20I World Cup 2026: టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి ముందే, టీం ఇండియా ఇద్దరు కీలక ఆటగాళ్లను కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఈ ప్రధాన ఈవెంట్‌లో టీం ఇండియా సమతుల్యతను దెబ్బతీస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ ఇద్దరూ కీలక ఆటగాళ్లు ఎవరో ఒకసారి పరిశీలిద్దాం..

టీమిండియాకు 440 వోల్ట్‌ల షాక్.. టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి ఇద్దరు డేంజరస్ ప్లేయర్స్ ఔట్..
Team India

Updated on: Nov 09, 2025 | 1:51 PM

Team India: భారత జట్టు 2026లో జరిగే టీ20 ప్రపంచ కప్‌లో ఆడాల్సి ఉంది. ఈ ప్రపంచ కప్‌నకు ముందు, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి జట్లతో జట్టు వన్డే, టీ20 సిరీస్‌లను ఆడుతుంది. ఈ కీలక టోర్నమెంట్‌, సిరీస్‌లతో భారత జట్టు బిజీగా ఉంది. అయితే ఈలోగా, భారత జట్టు రెండు ప్రధాన ఎదురుదెబ్బలను చవిచూడాల్సి వచ్చింది.

టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి ముందే, టీం ఇండియా ఇద్దరు కీలక ఆటగాళ్లను కోల్పోవాల్సి వచ్చింది. ఆ ఇద్దరూ కీలక ఆటగాళ్లు ఎవరో ఒకసారి పరిశీలిద్దాం..

టీ20 ప్రపంచ కప్‌నకు ముందు టీమిండియాకు 440 వోల్ట్ షాక్..

భారత్, దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్ జరగనుంది. ఈ టీ20 సిరీస్ ప్రారంభానికి ముందే, టీం ఇండియా రెండు పరాజయాలను చవిచూసింది. దీంతో టీ20 ప్రపంచ కప్ వంటి ప్రధాన ఈవెంట్‌లో టీం ఇండియా సమతుల్యతను దెబ్బతీస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

టీ20 ప్రపంచ కప్‌నకు ముందు గాయపడిన ఇద్దరు భారత ఆటగాళ్లు..

వచ్చే నెల నుంచి భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. కానీ, దానికి ముందు, టీమిండియాలోని ఇద్దరు కీలక ఆటగాళ్ళు, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డారు.

రజత్ పాటిదార్ గురించి చెప్పాలంటే, ఇండియా ఏ, దక్షిణాఫ్రికా ఏ మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా అతను గాయపడ్డాడు. ఇప్పుడు, నివేదికల ప్రకారం అతను రాబోయే నాలుగు నెలల పాటు ఆటకు దూరంగా ఉంటాడు. అతని గాయం కారణంగా, అతను ఇండియా ఏ, దక్షిణాఫ్రికా ఏ మధ్య జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో పాల్గొనలేకపోయాడు.

IPL 2026 నుంచి పాటీదార్ జట్టులోకి రీఎంట్రీ..

భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ రజత్ పాటిదార్ గురించి చెప్పాలంటే, అతని గాయం చాలా తీవ్రంగా ఉందని చెబుతున్నారు. ఈ కారణంగా, రాబోయే నాలుగు నెలలు అతను తిరిగి రావడం చాలా కష్టం. దీని అర్థం అతను మొత్తం దేశవాళీ క్రికెట్ సీజన్‌కు దూరమవుతాడు. అతను ఇప్పుడు నేరుగా IPL 2026లో తిరిగి వచ్చే అవకాశం ఉంది.

శ్రేయాస్ అయ్యర్ కూడా..

రజత్ పాటిదార్‌తో పాటు, టీం ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్, వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్నారు. శ్రేయాస్ అయ్యర్ పునరాగమనం గురించి ప్రస్తుతం ఎటువంటి సమాచారం లేదు. టీ20 ప్రపంచ కప్‌ను పరిశీలిస్తే, ఈ రెండు గాయాలు భారత జట్టుకు పెద్ద దెబ్బ.

2026 టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టులో శ్రేయాస్ అయ్యర్, రజత్ పాటిదార్ చోటు దక్కించుకుంటారని ఆశలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు వారి గాయాల తర్వాత చాలా కష్టంగా కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..