
ICC World Cup 2023: వన్డే ప్రపంచ కప్ 2023 ఇప్పటివరకు చాలా ఆసక్తిగా కొనసాగుతోంది. టోర్నీలో బంతికి బ్యాట్‌కి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. అనుభవజ్ఞుల నుంచి యువ ఆటగాళ్ల వరకు ఎంతో మంది ఆటగాళ్లు టోర్నీలో తమదైన ముద్ర వేశారు. అదే సమయంలో, టోర్నమెంట్ కొంతమందికి చాలా చెడ్డదిగా నిరూపితమైంది. అయితే తమ ఆటతీరుతో టోర్నీలో మెరిసిన ఆటగాళ్లలో చాలామందే ఉన్నారు. ముఖ్యంగా 10 మంది ఆటగాళ్లు తమ ప్రదర్శనతోపాటు, ఇటు బ్యాటింగ్, ఫీల్డిండ్, బౌలింగ్ రంగాల్లో తమదైన ముద్ర వేశారు. వారెవరో ఇప్పుడు చూద్దాం..
1- క్వింటన్ డి కాక్: తన చివరి ప్రపంచకప్ ఆడుతున్న దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డి కాక్ ఇప్పటివరకు అద్భుతమైన ఫామ్‌తో కనిపించాడు. డి కాక్ టోర్నమెంట్‌లో గరిష్టంగా 3 సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం అతను ప్రపంచ కప్ 2023లో అత్యధిక స్కోరర్‌గా ఉన్నాడు. ఆఫ్రికన్ ఓపెనర్ 6 ఇన్నింగ్స్‌ల్లో 431 పరుగులు చేశాడు.
2- మహ్మద్ షమీ: అనుభవజ్ఞుడైన భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ 2023 ప్రపంచకప్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే సంచలనం సృష్టించాడు. టోర్నీలో తొలి మ్యాచ్ ఆడుతున్న సమయంలో 4 వికెట్లు పడగొట్టాడు. షమీ రెండు మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీశాడు.
3- డేవిడ్ వార్నర్: అనుభవజ్ఞుడైన ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టోర్నీలో ఇప్పటివరకు 2 సెంచరీలు సాధించాడు, ఇందులో అతని అత్యధిక స్కోరు 163 పరుగులు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన వార్నర్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. అతను 6 ఇన్నింగ్స్‌ల్లో 413 పరుగులు చేశాడు.
4- ట్రావిస్ హెడ్: ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ 2023 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా క్రికెట్ మైదానంలోకి తిరిగి వచ్చాడు. తలకు గాయం కావడంతో క్రికెట్‌కు దూరంగా ఉన్న అతను తిరిగి వచ్చిన వెంటనే తొలి మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. న్యూజిలాండ్‌పై హెడ్ 109 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
5- హెన్రిచ్ క్లాసెన్: ఇప్పటివరకు జరిగిన టోర్నీలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్ అద్భుత ప్రదర్శన చేశాడు. క్లాసెన్ 6 ఇన్నింగ్స్‌లలో 300 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో 10వ స్థానంలో ఉన్నాడు. తన బ్యాట్‌తో ఓ సెంచరీ కూడా చేశాడు.
6- స్కాట్ ఎడ్వర్డ్స్: ఇప్పటివరకు జరిగిన టోర్నీలో నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ అద్భుతమైన ఫామ్ కనబరిచాడు. ఇప్పటివరకు అతను 6 మ్యాచ్‌లలో 2 అర్ధ సెంచరీలతో సహా 6 ఇన్నింగ్స్‌లలో 204 పరుగులు చేశాడు.
7- పాతుమ్ నిస్సాంక: 2023 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు అత్యధికంగా 4 అర్ధసెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా శ్రీలంక ఆటగాడు పాతుమ్ నిస్సాంక నిలిచాడు. అదే సమయంలో అతను 6 మ్యాచ్‌లలో 6 ఇన్నింగ్స్‌లలో 289 పరుగులు చేశాడు.
8- అబ్దుల్లా షఫీక్: ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో అరంగేట్రం చేసిన పాకిస్థాన్ యువ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ సెంచరీ (113) చేశాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో షఫీక్ 14వ స్థానంలో ఉన్నాడు. అతను 5 ఇన్నింగ్స్‌ల్లో 1 సెంచరీ, 2 అర్ధ సెంచరీల సాయంతో 264 పరుగులు చేశాడు.
9- రచిన్ రవీంద్ర: న్యూజిలాండ్ యువ ఓపెనర్ రచిన్ రవీంద్ర తొలి ప్రపంచకప్‌లోనే అందరికీ షాక్ ఇస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అతను 123* పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటి వరకు 2 సెంచరీలతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. 6 మ్యాచ్‌ల్లో 6 ఇన్నింగ్స్‌ల్లో 406 పరుగులు చేశాడు.
10- మార్కో జాన్సెన్: దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మార్కో జాన్సెన్ బంతితో పాటు బ్యాట్‌లోనూ అద్భుత ప్రతిభ కనబరిచాడు. యాన్సెన్ ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. బ్యాట్‌తో, అతను 6 ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 12*, 26, 09, 75*, 1*, 20 పరుగుల ఇన్నింగ్స్‌లు ఆడాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..