Travis Head unique feat in 2024: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ ప్రస్తుతం వేగవంతమైన బ్యాట్స్‌మెన్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. 2024లో టీ20 క్రికెట్‌లో అతని నిరంతర ప్రదర్శన దీనికి నిదర్శనం. తన అద్భుత ప్రదర్శనతో నిరంతరం అందరినీ ఆకర్షిస్తున్న హెడ్.. టీ20 క్రికెట్‌లో బౌలర్లను చిత్తు చేస్తూ కనిపిస్తున్నాడు. తాజాగా స్కాట్లాండ్‌తో పాటు ఇంగ్లండ్‌పై ఆడిన తుఫాన్ ఇన్నింగ్స్ చర్చనీయాంశంగా మారింది. దీనికి ముందు, అతను IPL 2024లో కూడా బౌలర్లను చిత్తు చేశాడు.
సెప్టెంబర్ 4న స్కాట్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో 25 బంతుల్లో 80 పరుగులు చేసి కంగారూ జట్టుకు ఏకపక్ష విజయాన్ని అందించడంలో ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత, సెప్టెంబర్ 11న ఇంగ్లండ్‌పై ఆడిన 23 బంతుల్లో 59 పరుగులు చేసిన అతని అద్భుతమైన ఇన్నింగ్స్ కూడా చర్చనీయాంశంగా మారింది. 2024 సంవత్సరం T20 క్రికెట్ పరంగా హెడ్‌కి చాలా విజయవంతమైంది. ఇటువంటి పరిస్థితిలో, 2024 సంవత్సరంలో T20 మ్యాచ్‌లో పవర్‌ప్లేలో ట్రావిస్ హెడ్ ఒక ఓవర్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ బౌండరీలు కొట్టిన బౌలర్లు ఏకంగా ఐదుగురు ఉన్నారు. ఆ లిస్టులో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..
IPL 2024 సందర్భంగా ఏప్రిల్ 20న సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నప్పుడు, పవర్‌ప్లే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ఎన్రిక్ నార్కియా వేసిన ఓవర్‌లో ట్రావిస్ హెడ్ మొత్తం 4 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. ఈ విధంగా అతను ఓవర్లో 22 పరుగులు చేశాడు.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, ఎన్రిక్ నార్కియా తర్వాత ట్రావిస్ హెడ్, ముఖేష్ కుమార్ వేసిన పవర్‌ప్లే చివరి ఓవర్‌లో మొదటి నాలుగు బంతుల్లో వరుసగా నాలుగు ఫోర్లు, చివరి బంతికి ఒక సిక్స్ కొట్టాడు.
IPL 2024లో, మే 8న, పవర్‌ప్లేలో లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ నవీన్-ఉల్-హక్ ఓవర్ చివరి ఐదు బంతుల్లో ట్రావిస్ హెడ్ బౌండరీలు కొట్టాడు. ఇందులో 4 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో హెడ్ 89 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు.
స్కాట్లాండ్‌తో జరిగిన T20 మ్యాచ్‌లో పవర్‌ప్లే సమయంలో, బౌలర్ బ్రాడ్లీ వీల్ వేసిన ఒక ఓవర్‌లో ట్రావిస్ హెడ్ వరుసగా 6 బంతులను బౌండరీలకు తరలించాడు. ఈ సమయంలో, హెడ్ మొత్తం 5 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు.
సెప్టెంబర్ 11, బుధవారం జరిగిన T20 మ్యాచ్ పవర్ ప్లేలో, ట్రావిస్ హెడ్ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కుర్రాన్ ఓవర్‌లో వరుసగా 6 బౌండరీలు కొట్టాడు. ఇందులో మొదటి రెండు బంతుల్లో 2 ఫోర్లు ఆ తర్వాత వరుసగా 3 సిక్సులు కొట్టాడు. ఆఖరి బంతికి ఒక ఫోర్ బాదేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..