World Cup 2023: ప్రపంచ కప్‌లో తన దేశానికి ప్రాతినిధ్యం వహించే ఏ ఆటగాడికైనా ఇది పెద్ద అవకాశం. ప్రతి ఆటగాడు తన మంచి ప్రదర్శన ఆధారంగా ప్రపంచ కప్‌లో తన దేశ జట్టులో భాగం కావాలని ప్రయత్నిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక బ్యాట్స్‌మన్ దృక్కోణంలో 50 ఓవర్ల టోర్నమెంట్‌లో సెంచరీ చేయడం కూడా చాలా గౌరవప్రదమైన విషయం. టోర్నమెంట్‌లోని ఏ ఎడిషన్‌లోనైనా చేసిన తొలి సెంచరీతో దాని ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే అక్టోబర్ 5 నుంచి ప్రారంభమైన ప్రపంచ కప్ 2023లో ఇదే విధమైన ఫీట్ చేశాడు. ఇంతకు ముందు ఇలాంటి ఫీట్ చేసిన దిగ్గజాల జాబితాలో అతని పేరు చేరింది.
డెవాన్ కాన్వే తన దేశం తరపున తొలిసారి వన్డే ప్రపంచ కప్ ఆడుతున్నాడు. టోర్నమెంట్‌లోని మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై అద్భుతంగా బ్యాటింగ్ చేసి కేవలం 83 బంతుల్లో తన కెరీర్‌లో ఐదో సెంచరీని నమోదు చేశాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఈ సెంచరీ తొలి సెంచరీ కూడా.
ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎడిషన్‌లోనూ పలు దేశాల ఆటగాళ్లు ఆయా ఎడిషన్‌లో తొలి సెంచరీ సాధించిన ఘనత సాధించారు. ఈ జాబితాలో భారత జట్టులోని ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ కూడా ఉన్నారు.
1975 ప్రపంచ కప్ – డెన్నిస్ అమిస్ (ఇంగ్లండ్): 137 vs భారతదేశం
1979 ప్రపంచ కప్ – గోర్డాన్ గ్రీనిడ్జ్ (వెస్టిండీస్): 106* vs భారతదేశం
1983 ప్రపంచ కప్ – అలాన్ లాంబ్ (ఇంగ్లండ్): 102 vs న్యూజిలాండ్
1987 ప్రపంచ కప్ – జావేద్ మియాందాద్ (పాకిస్తాన్): 103 vs శ్రీలంక
1992 ప్రపంచ కప్ – మార్టిన్ క్రో (న్యూజిలాండ్): 100* vs ఆస్ట్రేలియా
1996 ప్రపంచ కప్ – నాథన్ ఆస్టిల్ (న్యూజిలాండ్) :101 vs ఇంగ్లాండ్
1999 ప్రపంచ కప్ – సచిన్ టెండూల్కర్ (భారతదేశం): 140* vs కెన్యా
2003 ప్రపంచ కప్ – బ్రియాన్ లారా (వెస్టిండీస్): 116 vs దక్షిణాఫ్రికా
2007 ప్రపంచ కప్ – రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా): 113 vs స్కాట్లాండ్
2011 ప్రపంచ కప్ – వీరేంద్ర సెహ్వాగ్ (భారతదేశం): 175 vs బంగ్లాదేశ్
2015 ప్రపంచ కప్ – ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా): 135 vs ఇంగ్లాండ్
2019 ప్రపంచ కప్ – జో రూట్ (ఇంగ్లండ్): 107 vs పాకిస్థాన్
2023 ప్రపంచ కప్ – డెవాన్ కాన్వే (న్యూజిలాండ్): 152* vs ఇంగ్లాండ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..