World Cup Qualifiers: వరల్డ్ కప్ ఆడాలనే కల చెదిరిపాయే.. రేసు నుంచి మూడు జట్లు ఔట్..

|

Jun 25, 2023 | 3:24 PM

World Cup Qualifiers 2023: 2023 వన్డే ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లు జూన్ 18 నుంచి జింబాబ్వేలో జరుగుతున్నాయి. వన్డే ప్రపంచకప్‌లో మిగిలిన రెండు స్థానాల కోసం 10 జట్ల మధ్య పోటీ నెలకొంది.

World Cup Qualifiers: వరల్డ్ కప్ ఆడాలనే కల చెదిరిపాయే.. రేసు నుంచి మూడు జట్లు ఔట్..
World Cup Qualifiers 2023
Follow us on

World Cup Qualifiers 2023 Points Table: 2023 వన్డే ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లు జూన్ 18 నుంచి జింబాబ్వేలో జరుగుతున్నాయి. వన్డే ప్రపంచకప్‌లో మిగిలిన రెండు స్థానాల కోసం 10 జట్ల మధ్య పోటీ నెలకొంది. ఇప్పుడు వీటిలో నాలుగు జట్లు ప్రపంచకప్‌ ఆడాలన్న కల చెదిరిపోయింది. జింబాబ్వే శనివారం వెస్టిండీస్‌ను ఓడించి పాయింట్ల పట్టికను పూర్తిగా మార్చేసింది.

ఇప్పటి వరకు అధికారికంగా నేపాల్, యునైటెడ్ స్టేట్స్, యూఏఈ జట్లు ప్రపంచ కప్‌లో సూపర్-10కి చేరుకోవడానికి రేసులో లేవు. అయితే, ఐర్లాండ్ తన మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. నేడు శ్రీలంకతో పోటీపడుతోంది. ఈరోజు ఐర్లాండ్ ఓడిపోతే, వన్డే ప్రపంచకప్‌లో ప్రధాన ఈవెంట్‌కు చేరుకునే రేసుకు కూడా దూరమవుతుంది.

పాయింట్ల పట్టిక తాజా పరిస్థితి..

క్వాలిఫయర్ రౌండ్‌లో 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించిన సంగతి తెలిసిందే. గ్రూప్‌-ఏ నుంచి జింబాబ్వే, నెదర్లాండ్స్‌, వెస్టిండీస్‌లు సూపర్‌-6కి అర్హత సాధించాయి. అదే సమయంలో గ్రూప్ B నుంచి ఏ జట్టు కూడా సూపర్-6కి చేరుకోలేదు. అయితే శ్రీలంక, ఒమన్, స్కాట్లాండ్‌లకు సూపర్-6లో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మెయిన్ ఈవెంట్‌లో టాప్-2 జట్లకు అర్హత..

2023 వన్డే ప్రపంచ కప్ 10 జట్ల మధ్య జరుగుతోంది. ఇందులో ఎనిమిది జట్లు నేరుగా అర్హత సాధించాయి. చివరి రెండు జట్లు క్వాలిఫైయింగ్ రౌండ్ నుంచి చేరుకుంటాయి.

ఈ ఎనిమిది జట్లు నేరుగా అర్హత..

ఆతిథ్య భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు 2023 వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాయి. ఇప్పుడు మిగిలిన రెండు జట్లు క్వాలిఫయర్స్ రౌండ్ నుంచి వస్తాయి. ప్రధాన ఈవెంట్ అక్టోబర్-నవంబర్లో జరగనుంది. స్వదేశంలో ఆడడం వల్ల టీమ్ ఇండియా ప్రపంచకప్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..