AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 Auction: బెంగళూరు రిటైన్ చేసే ముగ్గురు ప్లేయర్లు.. లిస్టులో టీమిండియా ఫ్యూచర్ పేసర్..

IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు, బీసీసీఐ గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను ఉంచుకునే అవకాశాన్ని ఫ్రాంచైజీకి ఇచ్చింది. అయితే, ఈ కాలంలో ఫ్రాంచైజీలు ఐదుగురు క్యాప్డ్, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లను ఉంచుకోవచ్చు. ఇటువంటి పరిస్థితిలో రాబోయే రోజుల్లో టీమ్ ఇండియాకు అరంగేట్రం చేయడంలో యష్ దయాల్ విజయవంతమైతే, అప్పుడు బెంగళూరుకు ఇబ్బంది ఉండవచ్చు .

IPL 2025 Auction: బెంగళూరు రిటైన్ చేసే ముగ్గురు ప్లేయర్లు.. లిస్టులో టీమిండియా ఫ్యూచర్ పేసర్..
Rcb Ipl 2025
Venkata Chari
|

Updated on: Oct 13, 2024 | 6:57 PM

Share

IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు, బీసీసీఐ గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను ఉంచుకునే అవకాశాన్ని ఫ్రాంచైజీకి ఇచ్చింది. అయితే, ఈ కాలంలో ఫ్రాంచైజీలు ఐదుగురు క్యాప్డ్, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లను ఉంచుకోవచ్చు. ఇటువంటి పరిస్థితిలో, రాబోయే రోజుల్లో టీమ్ ఇండియాకు అరంగేట్రం చేయడంలో యష్ దయాల్ విజయవంతమైతే, అప్పుడు బెంగళూరుకు ఇబ్బంది ఉండవచ్చు .

ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో యష్ దయాల్‌కు అవకాశం లభించింది. అయితే, అతను ఏ మ్యాచ్‌లోనూ ప్లేయింగ్ 11లో భాగం కాలేదు. న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లో యష్ మళ్లీ జట్టులోకి ఎంపిక అవుతాడని, ఈసారి అతను తన అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం పొందుతాడనే ఆశ ఉంది.

యష్ దయాల్ అంతర్జాతీయ అరంగేట్రం చేసిన తర్వాత RCB అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లుగా ఉంచుకోగల ముగ్గురు ఆటగాళ్లను ఓసారి చూద్దాం..

3. అనుజ్ రావత్..

అనూజ్ రావత్ గత మూడు సీజన్‌లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అనుబంధం కలిగి ఉన్నాడు. ఈ కాలంలో అతనికి ఆడే అవకాశాలు చాలా తక్కువ. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో తనదైన ముద్ర వేయడంలో అనూజ్ సక్సెస్ కానప్పటికీ, భవిష్యత్తుకు ఉపయోగపడే ఆటగాడిగా నిరూపించుకోగలడు. ఇందుకోసం అనుజ్‌కి అవకాశం ఇవ్వాలి. ఫ్రాంచైజీకి అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఉండేందుకు అనుజ్ రావత్ మంచి ఎంపిక.

2. విజయ్‌కుమార్..

విజయ్‌కుమార్ IPL 2023లో RCB జట్టులో భాగమయ్యాడు. అతను 11 మ్యాచ్‌లలో జట్టు కోసం 14 వికెట్లు పడగొట్టాడు. విజయ్ కుమార్ ఇటీవల మహారాజా T20 ప్రీమియర్ లీగ్ 2024లో అద్భుత ప్రదర్శన చేశాడు. దులీప్ ట్రోఫీలో కూడా సక్సెస్ అయ్యాడు. విజయకుమార్‌ను కొనసాగించడం ఫ్రాంచైజీకి లాభదాయకమైన ఒప్పందం కావచ్చు.

1. మహిపాల్ లోమ్రోర్..

ఆల్ రౌండర్ మహిపాల్ లోమ్రోర్ కూడా ఈ జాబితాలో చేరాడు. మహిపాల్ ప్రతిభ గల ఆటగాడు. అతను వేగంగా పరుగులు సాధించగలడు. ఫ్రాంచైజీ మహిపాల్‌కు మరో అవకాశం ఇవ్వాలని భావించవచ్చు. ఎందుకంటే RCB అతనిని రిటైన్ చేయడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయనవసరం లేదు. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా అతనే అత్యుత్తమ ఎంపిక.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..