IND vs ZIM: రెండో టీ20 నుంచి ముగ్గురు ఔట్.. అరంగేట్రం చేయనున్న యువ సంచలనాలు.. డకౌట్లు కావొద్దంటోన్న ఫ్యాన్స్

|

Jul 07, 2024 | 10:19 AM

3 Changes in Team India Playing XI for 2nd T20I: భారత్ వర్సెస్ జింబాబ్వే (IND vs ZIM) మధ్య ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్ ప్రారంభమైంది. సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో పెద్ద పరాజయం పాలైంది. జింబాబ్వే చేతిలో భారత్ 13 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శుభ్‌మన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు 115/9 స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 19.5 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది.

IND vs ZIM: రెండో టీ20 నుంచి ముగ్గురు ఔట్.. అరంగేట్రం చేయనున్న యువ సంచలనాలు.. డకౌట్లు కావొద్దంటోన్న ఫ్యాన్స్
Ind Vs Zim Records
Follow us on

3 Changes in Team India Playing XI for 2nd T20I: భారత్ వర్సెస్ జింబాబ్వే (IND vs ZIM) మధ్య ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్ ప్రారంభమైంది. సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో పెద్ద పరాజయం పాలైంది. జింబాబ్వే చేతిలో భారత్ 13 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శుభ్‌మన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు 115/9 స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 19.5 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది.

ఈ చెత్త ప్రదర్శన తర్వాత, రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కొన్ని మార్పులు కనిపించవచ్చని తెలుస్తోంది. రెండవ టీ20లో టీమిండియా ప్లేయింగ్ XI నుంచి తప్పించనున్న ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

3. అవేష్ ఖాన్..

ఈ పర్యటనకు ఎంపికైన భారత జట్టులోని కీలక ఆటగాళ్లలో అవేశ్ ఖాన్ ఒకడు. అయితే, మొదటి మ్యాచ్‌లో అతని ప్రదర్శన పూర్తిగా పేలవంగా కనిపించింది. అవేష్ 4 ఓవర్లు వేసిన 29 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. ఇటువంటి పరిస్థితిలో, అతను రెండవ మ్యాచ్‌లో ప్లేయింగ్ XI నుంచి తొలగించవచ్చు. అతని స్థానంలో, IPL 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున అద్భుతంగా ప్రదర్శన చేసిన హర్షిత్ రానాకు అవకాశం లభించవచ్చు. అతను తన వేగంతో వార్తల్లో నిలఃిచిన సంగతి తెలిసిందే.

2. ధృవ్ జురెల్..

సంజు శాంసన్ వంటి వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ లేకపోవడంతో, ధృవ్ జురెల్ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేయడం ద్వారా జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి మంచి అవకాశం కలిగింది. కానీ, అతను 14 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తుఫాన్ బ్యాటింగ్‌కు పేరుగాంచిన జితేష్ శర్మ ఇప్పుడు సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు సంపాదించేందుక కష్టపడుతున్నాడు.

1. అభిషేక్ శర్మ..

ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున తుఫాను బ్యాటింగ్ చేసిన అభిషేక్ శర్మ తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. అభిషేక్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి డకౌట్‌గా అవుటయ్యాడు. రెండో టీ20 మ్యాచ్‌లో అతని స్థానంలో సాయి సుదర్శన్‌కు అవకాశం లభించవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..