World Cup 2023: ప్రపంచకప్ 2023ను గెలుచుకోవడానికి టీమ్ ఇండియా అతిపెద్ద పోటీదారుగా పరిగణిస్తున్నారు. స్వదేశంలో టీమిండియా రికార్డ్ అటు బ్యాటర్లకు, ఇటు బౌలర్లకు మనోధైర్యాన్ని మరింత పెంచుతోంది. క్రికెట్ నిపుణుల నుంచి అభిమానుల వరకు అందరూ రోహిత్ సేనను ఫేవరేట్‌గా పరిగణించడానికి ఇదే కారణం. అయితే, ప్రపంచకప్ గెలవడానికి టీమ్ ఇండియా అతిపెద్ద పోటీదారుగా పరిగణించాలంటే మరోసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా రికార్డును దెబ్బకొట్టే జట్లు చాలానే ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఐదు జట్లు ఉన్నాయని తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు.
ప్రపంచ కప్‌లో ఇలాంటి ఐదు జట్లు ఉన్నాయి. వాటిపై టీమ్ ఇండియా ఎక్కువ మ్యాచ్‌లు ఓడిపోయింది. లేదా గెలుపు, ఓటములు సమానంగా ఉన్నాయి. పూర్తి వివరాలను ఓసారి చూద్దాం..
ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన 8 మ్యాచ్‌ల్లో టీమిండియా 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 3 మ్యాచ్‌లు గెలిచింది. 2011లో రెండు జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్ మ్యాచ్ టై అయింది. ఈసారి కూడా ఇంగ్లండ్ జట్టు పటిష్టంగా ఉంది. గత ప్రపంచకప్‌ను కూడా గెలుచుకుంది.
ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై కూడా టీమ్‌ఇండియా రికార్డు దారుణంగా ఉంది. ఆస్ట్రేలియాపై భారత్ నాలుగు మ్యాచ్‌లు మాత్రమే గెలుపొందగా, మరోవైపు కంగారూ జట్టు రెండింతలు గెలిచింది. అంటే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా 8 సార్లు టీమ్‌ఇండియాను ఓడించింది. ప్రపంచకప్‌లో భారత్‌పై ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్ కూడా పైచేయి సాధించింది. ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ ఐదు మ్యాచ్‌ల్లో భారత్‌ను ఓడించింది. మూడింటిలో ఓడిపోయింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా కూడా భారత్‌ను ఓడించింది. టీం ఇండియా కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ప్రపంచకప్‌లో శ్రీలంక, భారత్‌ల మధ్య పోటీ సమంగా నెలకొంది. శ్రీలంక నాలుగు మ్యాచ్‌ల్లో భారత్‌ను ఓడించగా, నాలుగింటిలో ఓడిపోయింది. ఈ ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లపై మాత్రమే భారత్ ఎక్కువ మ్యాచ్‌లు గెలిచింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, నెదర్లాండ్స్ ప్రపంచకప్‌లో భారత్‌ను ఎన్నడూ ఓడించలేకపోయాయి.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..