IPL 2023: ఐపీఎల్ 2023లో ఈసారి చాలా మంది పవర్ హిట్టర్లు కనిపించనున్నారు. ఆండ్రీ రస్సెల్, నికోలస్ పూరన్, లియామ్ లివింగ్‌స్టోన్‌లతో సహా చాలా మంది పవర్ హిట్టర్‌లు సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పగలరు.
వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ ఆండ్రీ రస్సెల్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అతను తన పవర్ హిట్టింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. ఎన్నోసార్లు లోయర్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తూ జట్టు కోసం మ్యాచ్‌లను గెలిపించడంలో సిద్ధహస్తుడు. రస్సెల్ ఫామ్‌లో ఉన్నప్పుడు, ప్రపంచంలోని ఏ బౌలర్‌నైనా చిత్తు చేయగల సామర్థ్యం అతనికి ఉంది. ఈసారి కూడా అతని పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ ఐపీఎల్ 2023లో కనిపిస్తుంది.
ఐపీఎల్ 2023లో నికోలస్ పూరన్ లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడనున్నాడు. గత కొన్ని సీజన్‌లుగా ఐపీఎల్‌లో యాక్టివ్‌గా ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు తన సత్తాకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేయడంలో విఫలమయ్యాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడాడు.
గతేడాది గుజరాత్ టైటాన్స్‌పై ఐపీఎల్ టైటిల్ గెలిచిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఇప్పుడు మరింత పరిణతి సాధించాడు. గత సీజన్‌లో జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. లోయర్ మిడిల్ ఆర్డర్‌లో సమర్థవంతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను తన పవర్ హిట్టింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. ఐపీఎల్ 2022లో తన జట్టు తరపున అత్యధికంగా 487 పరుగులు చేశాడు.
వెస్టిండీస్ క్రికెట్ టీమ్ టీ20 కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ తన భీకర బ్యాటింగ్‌కు పేరుగాంచాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అద్భుతాలు చేస్తున్నాడు. రోవ్‌మన్ పావెల్ ఢిల్లీ క్యాపిటల్స్‌లో భాగంగా ఉన్నాడు. అతని పవర్ హిట్టింగ్ IPL 2023లో కూడా కనిపిస్తుంది.
ఇంగ్లండ్‌కు చెందిన తుఫాను బ్యాట్స్‌మెన్ లియామ్ లివింగ్‌స్టోన్ పంజాబ్ కింగ్స్ తరపున బరిలోకి దిగనున్నాడు. అతని పవర్ హిట్టింగ్ అద్భుతం అనడంలో ఎలాంటి సందేహం లేదు. మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించగల సత్తా అతనికి ఉంది. అతని బ్యాటింగ్ ఐపీఎల్ 2023లో కూడా కనిపిస్తుంది.
చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన రవీంద్ర జడేజా కూడా పవర్ హింటింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. ఐపీఎల్‌లో ఒకే ఓవర్‌లో 37 పరుగులు చేశాడు. రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్షల్ పటేల్ బంతుల్లో అతను ఈ చరిష్మా చేశాడు. ప్రస్తుతం, జడేజా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను IPL 2023లో భీకర బ్యాటింగ్‌తో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..