
IND vs NZ Records: జనవరి 25, ఆదివారం జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్‌పై భారత క్రికెట్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా, సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. దీంతో మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది.
గువహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్ స్థానాల్లో జస్పీత్ బుమ్రా, రవి బిష్ణోయ్‌లు జట్టులోకి వచ్చారు.
టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ నిర్ణయం సరైనదని బౌలర్లు నిరూపించారు. నిర్ణీత ఓవర్లలో న్యూజిలాండ్‌ను 153/9 పరుగులకే కట్టడి చేశారు. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ (48) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా, హార్దిక్ పాండ్యా, రవి బిష్ణోయ్ తలో రెండు వికెట్లు తీశారు.
అనంతరం ఛేజింగ్‌లో సంజు శాంసన్ ‘గోల్డెన్ డక్’ అయినప్పటికీ, అభిషేక్ శర్మ కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది భారత్ తరపున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీతో భారీ రికార్డును నెలకొల్పాడు. ఇషాన్ కిషన్ (28), సూర్యకుమార్ యాదవ్ (57 నాటౌట్) రాణించడంతో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
వరుస సిరీస్ విజయాలు: టీమిండియా వరుసగా 10వ టీ20 సిరీస్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
అభిషేక్ శర్మ మెరుపు వేగం: టీ20ల్లో 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్‌గా అభిషేక్ నిలిచాడు.
హాఫ్ సెంచరీల రికార్డు: 25 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో 9 సార్లు హాఫ్ సెంచరీ మార్కును అందుకున్న ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి అభిషేక్ అగ్రస్థానాన్ని పంచుకున్నాడు.
ప్రపంచ రికార్డు: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో (పూర్తి సభ్య దేశాల మధ్య) మూడో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని అభిషేక్ నమోదు చేశాడు.
పవర్‌ప్లే విధ్వంసం: పవర్‌ప్లేలో భారత్ 94/2 పరుగులు చేసింది. ఇది టీమిండియాకు రెండో అత్యధిక పవర్‌ప్లే స్కోరు (అత్యధికం 95/1, 2025లో ఇంగ్లాండ్‌పై).
వేగవంతమైన ఛేజింగ్: 150 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలోనే పూర్తి చేసి భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది.
కుల్దీప్ యాదవ్ వికెట్ లేని ఇన్నింగ్స్: గత 11 ఇన్నింగ్స్‌ల్లో కుల్దీప్ యాదవ్ వికెట్ తీయకపోవడం ఇదే మొదటిసారి. చివరిసారిగా 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో అతను వికెట్ తీయలేకపోయాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..