జనవరి 22 న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా లక్షలాది మంది ప్రముఖుల సమక్షంలో రామమందిరంలో ప్రాణప్రతిష్టాపన జరగనుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు జనవరి 22న అయోధ్య చేరుకోవడానికి సిద్ధమవుతున్నారు. దీంతో మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగానూ శ్రీరామనామస్మరణ వినిపిస్తోంది. తాజాగా మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో కూడా రాముని కీర్తనలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ జట్టు మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కూడా కాషాయ జెండా పట్టుకుని జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ రామమందిరాన్ని సందర్శించడానికి ఉత్సాహంగా ఉన్నానన్నాడు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో అయోధ్య రామమందిరం గురించి ఒక ఆసక్తికర పోస్ట్‌ను పంచుకున్నాడు. ఇందులో చేతిలో కాషాయ జెండాను పట్టుకుని కనిపించాడు డానిష్ కనేరియా. ‘ అయోధ్యలో మన రాజు శ్రీరాముని మహా మందిరం సిద్ధంగా ఉంది. రామమందిరంలో ప్రాణ ప్రతిష్ఠాపన పనులకు కేవలం 8 రోజులు మాత్రమే మిగిలి ఉంది’ అని రాసుకొచ్చిన పాక్ క్రికెటర్ చివరిలో జై-జై శ్రీరాం అని క్యాప్షన్ ఇచ్చాడు.
పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు చాలా ఏళ్ల పాటు సేవలు అందించాడు డానిష్ కనేరియా. ఈ మిస్టరీ స్పిన్నర్ పాకిస్తాన్ జట్టులో ఏకైక హిందువు. అందుకే చాలా సార్లు పూజ పునస్కారాలు చేస్తూ కనిపిస్తుంటాడీ మాజీ క్రికెటర్. నిజానికి జై శ్రీరామ్ అని పిలవడం డానిష్‌కి ఇదేమీ మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా పలు సందర్భాల్లో హిందూ సంప్రదాయాలు, భారతీయ ఆచార వ్యవహారాలంటే తనకు చాలా గౌరవముందని బహిరంగంగానే ప్రకటించాడు.
డానిష్ కనేరియా కెరీర్ విషయానికొస్తే.. పాకిస్థాన్ తరఫున 61 టెస్టులు, 18 వన్డేలు ఆడాడీ క్రికెటర్. టెస్టుల్లో 261 వికెట్లు, వన్డేల్లో 15 వికెట్లు తీశాడు. అతని వన్డే కెరీర్ అంత గొప్పగా లేనప్పటికీ, టెస్టుల్లోనే పాకిస్థాన్ అత్యుత్తమ స్పిన్ బౌలర్లలో డానిష్ ఒకడు.
हमारे राजा श्रीराम का भव्य मंदिर है तैयार,
अब सिर्फ 8 दिन का है इंतजार!बोलो जय जय श्री राम। pic.twitter.com/poojMBb7U4
— Danish Kaneria (@DanishKaneria61) January 14, 2024
Once a temple, always a temple. pic.twitter.com/xQhOzDgPW5
— Danish Kaneria (@DanishKaneria61) January 5, 2024
Happy 2024!
Have a promising and fulfilling new year! pic.twitter.com/xYggqQdHbK
— Danish Kaneria (@DanishKaneria61) January 1, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..