AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ఆత్మహత్యా లేక హత్యా? టీమిండియా మాజీ క్రికెటర్ తల్లి అనుమానాస్పద మృతి..

Salil Ankola Mother Death: భారత మాజీ క్రికెటర్ సలీల్ అంకోలా పెద్ద చిక్కుల్లో పడ్డాడు. ఆదివారం అతని తల్లి ఈ ప్రపంచానికి వీడ్కోలు చెప్పింది. అంకోలా స్వయంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను పంచుకోవడం ద్వారా ఈ సమాచారాన్ని అందించారు. సలీల్ తల్లికి 77 సంవత్సరాలు, పూణేలోని తన ఫ్లాట్‌లో నివసిస్తోంది. ఆమె మృతికి అసలు కారణం వెల్లడి కాలేదు. అయితే, ఆమె మెడపై దాడి జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

Team India: ఆత్మహత్యా లేక హత్యా? టీమిండియా మాజీ క్రికెటర్ తల్లి అనుమానాస్పద మృతి..
Salil Ankola Mother Dies
Venkata Chari
|

Updated on: Oct 05, 2024 | 1:01 PM

Share

Salil Ankola Mother Death: భారత మాజీ క్రికెటర్ సలీల్ అంకోలా పెద్ద చిక్కుల్లో పడ్డాడు. ఆదివారం అతని తల్లి ఈ ప్రపంచానికి వీడ్కోలు చెప్పింది. అంకోలా స్వయంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను పంచుకోవడం ద్వారా ఈ సమాచారాన్ని అందించారు. సలీల్ తల్లికి 77 సంవత్సరాలు, పూణేలోని తన ఫ్లాట్‌లో నివసిస్తోంది. ఆమె మృతికి అసలు కారణం వెల్లడి కాలేదు. అయితే, ఆమె మెడపై దాడి జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

సలీల్ అంకోలా శుక్రవారం తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు. ఈ పోస్ట్‌లో, అతను తన దివంగత తల్లి ఫొటోను పంచుకున్నాడు. ‘గుడ్‌బై మదర్’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ షేర్ చేశాడు.

సలీల్ అంకోలా అంతర్జాతీయ కెరీర్..

56 ఏళ్ల సలీల్ అంకోలా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ఎంతో కాలం నిలవలేదు. అతను టెస్ట్, వన్డే రెండింటితో కలిపి మొత్తం 21 మ్యాచ్‌లు ఆడాడు. అతను నవంబర్ 1989లో పాకిస్తాన్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఫిబ్రవరి 1997లో న్యూజిలాండ్‌తో తన చివరి మ్యాచ్ ఆడాడు. సలీల్ ఒక టెస్టు, 20 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను మొత్తం 15 వికెట్లు పడగొట్టాడు. ట్యూమర్ కారణంగా సలీల్ కేవలం 29 ఏళ్లకే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

నటనలోనూ ప్రవేశం..

View this post on Instagram

A post shared by Salil Ankola (@salilankola)

సలీల్ అంకోలాకు క్రికెట్‌తో పాటు నటన కూడా చాలా ఇష్టం. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతను ఎట్టకేలకు తన హాబీని నెరవేర్చుకున్నాడు. సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించిన కురుక్షేత్ర చిత్రంతో సలీల్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఇది కాకుండా, సలీల్ చుర లియా హై తుమ్నే, రివాయత్, ఏక్తా, ది పవర్‌తో సహా ఇతర చిత్రాలలో కూడా నటించాడు. కానీ, అతను పెద్దగా పేరు సంపాదించలేకపోయాడు. అందుకే సినిమా ప్రపంచానికి కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం సలీల్ ఏ రంగంలో యాక్టివ్‌గా ఉన్నారనే సమాచారం లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..