Yashpal Sharma: టీమిండియా మాజీ క్రికెటర్​ యశ్​పాల్​ కన్నుమూత.. భావోద్వేగానికి గురైన భారత క్రికెటర్లు

| Edited By: Janardhan Veluru

Jul 13, 2021 | 1:27 PM

టీమిండియా మాజీ క్రికెటర్​ యశ్​పాల్​ శర్మ గుండెపోటుతో మృతి చెందారు. 1983 ప్రపంచకప్​ గెలిచిన భారత జట్టులో యశ్​పాల్​ శర్మ కూడా సభ్యుడు. ఈ మెగాటోర్నీలో కపిల్​ దేవ్ జట్టు విశ్వ విజేతగా..

Yashpal Sharma: టీమిండియా మాజీ క్రికెటర్​ యశ్​పాల్​ కన్నుమూత.. భావోద్వేగానికి గురైన భారత క్రికెటర్లు
Yashpal Sharma
Follow us on

టీమిండియా మాజీ క్రికెటర్​ యశ్​పాల్​ శర్మ గుండెపోటుతో మృతి చెందారు. 1983 ప్రపంచకప్​ గెలిచిన భారత జట్టులో యశ్​పాల్​ శర్మ కూడా సభ్యుడు. ఈ మెగాటోర్నీలో కపిల్​ దేవ్ జట్టు విశ్వ విజేతగా నిలవడంలో యశ్​పాల్​ కీలక పాత్ర పోషించారు. కెరీర్​లో 37 వన్డేలతో పాటు 42 టెస్టుల్లో భారత్​కు ప్రాతినిధ్యం వహించారు​. 1979-83 కాలంలో భారత జట్టు మిడిలార్డర్​లో కీలక బ్యాట్స్​మన్​గా సేవలందించారు.

రిటైర్మెంట్ ప్రకటించిన​ తర్వాత కొద్దికాలం జాతీయ సెలెక్టర్​గా పనిచేశారు. రంజీల్లో పంజాబ్​, హరియాణాతో పాటు రైల్వేస్​ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. దేశవాళీల్లో 160 మ్యాచ్​లు ఆడిన ఈ మాజీ క్రికెటర్​.. 8,933 పరుగులు సాధించారు. ఇందులో 21 సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరుతోపాటు నాటౌంట్‌‌గా నిలిచి 201 పరుగుల చేశారు.

యశ్​పాల్ మృతిపై సహచర క్రికెటర్​ మదన్​లాల్​ స్పందించారు. యశ్​పాల్ లేడనే విషయం నమ్మలేకపోతున్నా. అతడితో కలిసి ఆడిన రోజులు గుర్తొస్తున్నాయని అన్నారు. ఆ రోజు పంజాబ్​ జట్టుతో మొదలైన మా ప్రయాణం.. ప్రపంచకప్​లోనూ కొనసాగింది. అతడు చనిపోయారనే విషయం కపిల్ చెప్పాడు. అందరం ఒక్క సారిగా షాకయ్యాం. అతని క్రికెట్​ జీవితం అద్భుతం. ఇటీవల ఓ బుక్​ లాంచ్ సందర్భంగా కలిశాం. ఇది నేను నమ్మలేకపోతున్నా. అతడికి భార్యతో పాటు ముగ్గురు పిల్లలున్నార అని భావోద్వేగం చెందారు.

ఇక సచిన్ టెండూల్కర్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. “యశ్పాల్ శర్మ జీ మరణం వార్త తెలిసి షాక్ అయ్యాను. తీవ్ర బాధగా ఉంది. 1983 ప్రపంచ కప్ సందర్భంగా అతను బ్యాటింగ్ చేయడాన్ని చూసిన జ్ఞాపకాలు. భారత క్రికెట్‌కు ఆయన చేసిన కృషి ఎప్పుడూ గుర్తుండిపోతుంది. అంటూ ట్వీట్ చేశాడు.

ఇవి కూడా చదవండి : Gupta Nidhulu: నిర్మల్‌ జిల్లాలో గుప్తనిధుల కలకలం.. కన్నం వేసేందుకు కన్నింగ్‌ ఫెల్లో ప్లాన్.. ఏమైందో తెలుసా..

Free Condoms: ఐదో తరగతి ఆపై విద్యార్థులకు కండోమ్స్‌ తప్పనిసరి.. సంచలన నిర్ణయం తీసుకున్న పబ్లిక్​ స్కూల్స్ ఎడ్యుకేషన్. ఎక్కడో తెలుసా?