Viral: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌కు ఎన్ని తిప్పలొచ్చిపడ్డాయో.. పాన్ కార్డ్ పొగొట్టుకొని..

|

Feb 16, 2022 | 10:11 AM

మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ మంగళవారం పాన్‌ కార్డు పోయడంతో చిక్కుల్లో పడ్డాడు. కష్టాల్లో ఉన్న కెవిన్ పీటర్సన్ పాన్ కార్డ్ సహాయం కోసం సోషల్ మీడియాను ఆశ్రయించాడు. అయితే..

Viral: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌కు ఎన్ని తిప్పలొచ్చిపడ్డాయో.. పాన్ కార్డ్ పొగొట్టుకొని..
Cricketer Kevin Pietersen
Follow us on

మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌(Kevin Pietersen) మంగళవారం పాన్‌ కార్డు పోయడంతో చిక్కుల్లో పడ్డాడు. కష్టాల్లో ఉన్న కెవిన్ పీటర్సన్ పాన్ కార్డ్(Kevin Pietersen PAN Card) సహాయం కోసం సోషల్ మీడియాను ఆశ్రయించాడు. పీటర్సన్ ట్వీట్ చేసి అభిమానుల నుంచి సహాయం కోరాడు. ట్వీట్ చేస్తున్నప్పుడు.. అతను తన పాన్ కార్డ్(PAN Card) పోగొట్టుకున్న విషయాన్ని వెల్లడించాడు. అయితే తన ట్వీట్‌లో ప్రధాని మోడీని ట్యాగ్ చేశాడు. కెవిన్ పీటర్సన్‌కు భారత్‌తో మంచి సంబంధం ఉంది. క్రిెకెట్ కామెంట్రీ చెప్పేందుకు తరచుగా భారతదేశానికి వస్తుంటాడు. అది IPL లేదా భారతదేశం హోమ్ సిరీస్ అయినా, పీటర్సన్ తరచుగా కామెంట్రీతో కనిపిస్తుంటాడు. ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ఆయనకు సందేశం పంపిన సంగతి తెలిసిందే.

కెవిన్ పీటర్సన్ హిందీలో ట్వీట్ చేస్తూ, ‘ఇండియా దయచేసి సహాయం చేయండి. నేను నా PAN కార్డ్‌ను పోగొట్టుకున్నాను..  నాకు ప్రయాణించేందుకు భౌతిక కార్డ్ అవసరం. ఎవరైనా దయచేసి నా సహాయం చేయండి. వీలైనంత త్వరగా నేను ఎవరిని కలవాలో చెప్పండి..?’ అంటూ ట్వీట్ చేశాడు.

సాయం చేసేందుకు ముందుకు వచ్చిన ఆదాయపు పన్ను శాఖ

కెవిన్ పీటర్సన్ ట్వీట్ చేసిన తర్వాత.. అతనికి ఆదాయపు పన్ను శాఖ నుంచి సమాధానం వచ్చింది. ఇన్‌కమ్ ట్యాక్స్ స్పందిస్తూ, ‘మీ దగ్గర పాన్ కార్డ్ వివరాలు ఉంటే, ఇలా దరఖాస్తు చేయడం.. తద్వారా మీరు ఫిజికల్ పాన్ కార్డ్ పొందవచ్చు’ అని రాశారు.

ఆదాయపు పన్ను తన రెండవ ప్రత్యుత్తరంలో, “మీకు పాన్ కార్డ్ వివరాలు గుర్తులేకపోతే, భౌతిక కార్డ్ కోసం పాన్ యాక్సెస్ కావాలనుకుంటే, మీరు మా వెబ్‌సైట్, ఇమెయిల్ చేయవచ్చు. .” అని ట్వీట్ చేసింది.

పాన్ కార్డ్ విదేశీ పౌరుల కోసం కూడా..

విదేశీ పౌరులు భారతదేశంలో నివసిస్తున్నట్లయితే లేదా ఏదైనా ఇతర మార్గాల నుంచి భారత్‌లో డబ్బు సంపాదిస్తున్నట్లయితే వారు కూడా పాన్ కార్డును తీసుకునేందుకు ఛాన్స్ ఉంది.  భారతదేశంలో పాన్ కార్డ్ పొందడానికి విదేశీ పౌరులు ఫారమ్ 49-AA నింపాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి: Ukraine Russia Crisis: ర్యష్యా వెనక్కి తగ్గలేదు.. పుతిన్‌ యుద్ధతంత్రంపై అమెరికా కీలక ప్రకటన..

Rudraksha Tree: మన తెలుగు నేలపై కాస్తున్న రుద్రాక్షలు.. ఎక్కడో తెలుసా?