Cricket News: ఇంగ్లండ్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్ ఆడుతుండగా ఓ బ్యాడ్ న్యూస్ తెలిసింది. ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ రే ఇల్లింగ్‌వర్త్ (89) కన్నుమూశాడు. 1970-71లో ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకున్న ఇంగ్లండ్ జట్టుకు ఇల్లింగ్‌వర్త్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతను క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నాడు. యార్క్‌షైర్ కౌంటీ అతని మరణం గురించి తెలియజేసింది. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత ఇల్లింగ్‌వర్త్ వ్యాఖ్యాతగా, నిర్వాహకుడిగా, కోచ్‌గా కూడా పనిచేశాడు. ఇల్లింగ్‌వర్త్ 1958, 1973 మధ్య ఇంగ్లండ్ తరపున 61 టెస్టులు ఆడాడు. 1836 పరుగులు, 122 వికెట్లు తీసుకున్నాడు. అతను 31 మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు అందులో 12 మ్యాచ్‌లు గెలిచాడు.
రే 1932 జూన్ 8న జన్మించాడు. ఫార్స్లీలోని స్థానిక క్లబ్‌తో క్రికెట్‌ను ప్రారంభించాడు. అతను రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో కూడా పనిచేశాడు. అతను 1951లో యార్క్‌షైర్‌తో అరంగేట్రం చేసాడు. మొదటి మ్యాచ్‌లోనే 56 పరుగులు చేశాడు. ఇల్లింగ్‌వర్త్ ఆల్ రౌండర్. అతను ఫాస్ట్ బౌలర్‌గా ప్రారంభించాడు కానీ తర్వాత ఆఫ్ స్పిన్నర్ అయ్యాడు. టెస్టుల్లో 1000 పరుగులు, 100 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో న్యూజిలాండ్‌పై అరంగేట్రం చేశాడు. యార్క్‌షైర్ విజయంలో ఇల్లింగ్‌వర్త్ ప్రధాన పాత్ర పోషించాడు. అతను 1958 నుంచి జట్టు ఏడు కౌంటీ ఛాంపియన్‌షిప్ విజయాలలో భాగంగా ఉన్నాడు.
అతని కెప్టెన్సీలో, యార్క్‌షైర్ 1966 నుంచి వరుసగా మూడుసార్లు ఈ టైటిల్‌ను గెలుచుకుంది. దీని తర్వాత అతను 1969లో లీసెస్టర్‌షైర్‌కు కెప్టెన్‌గా మారాడు. ఆ ఏడాది 37 ఏళ్ల వయసులో తొలిసారి ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ప్రారంభంలో అతను గాయపడిన కోలిన్ కౌడ్రీ స్థానంలో కెప్టెన్ అయ్యాడు. తర్వాత కెప్టెన్‌గా కొనసాగాడు అతని కెప్టెన్సీలో ఇంగ్లండ్ మూడేళ్లపాటు అజేయంగా కొనసాగింది. అతని కెప్టెన్సీ అతిపెద్ద విజయం 1970-71లో యాషెస్ సిరీస్ విజయం. ఏడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-0తో కైవసం చేసుకుంది.
We are deeply saddened to learn that Ray Illingworth has passed away.
Our thoughts are with Ray’s family and the wider Yorkshire family who held Ray so dear to their hearts #OneRose pic.twitter.com/nvQa2f7RMz
— Yorkshire CCC (@YorkshireCCC) December 25, 2021