భారత పేసర్ మహ్మద్ షమీపై మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు ఐపీఎల్ 2025 వేలానికి ముందు హాట్ టాపిక్‌గా మారాయి. షమీ గాయాల చరిత్ర అతని వేలం విలువను తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే మంజ్రేకర్ ని ఉద్దేశించి షమీ కూడా షమీ వ్యంగ్యంగా స్పందిస్తూ పోస్టు చేశాడు మంజ్రేకర్‌ను “బాబాజీ” అంటూ సోషల్ మీడియాలో పరోక్షంగా వెక్కిరించారు.
షమీ గాయాల చరిత్ర ఐపీఎల్ జట్లకు ఆందోళనగా మారొచ్చు. గతంలో కూడా అతడు గాయాల బారిన పడిన కారణంగా.. ఫ్రాంచైజీలు షమిని భారీ ధరకు తీసుకోవడంలో వెనుకడుగు వేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. షమీ తన ప్రత్యేక శైలిలో ఈ వ్యాఖ్యలపై స్పందించారు. సోషల్ మీడియా ద్వారా, “బాబాజీ కి జై హో. మీ భవిష్యత్తు కోసం కొంత జ్ఞానం ఆదా చేసుకోండి,” అంటూ షమీ కౌంటర్ ఇచ్చాడు.
కాగా ఇటీవలి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో షమీ తన ఫిట్‌నెస్‌ను మరోసారి నిరూపించుకున్నాడు. బెంగాల్ తరఫున ఆడుతూ, మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసి తన ఫిట్‌నెస్‌పై ఉన్న అనుమానాలను తొలగించారు.
2025 వేలంలో రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో నమోదు అయిన షమీ, 2022లో గుజరాత్ టైటాన్స్ ద్వారా రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేయబడ్డాడు. మంజ్రేకర్ అభిప్రాయం ప్రకారం, ఈసారి అతని గాయాల చరిత్రపై ఫ్రాంచైజీలు ఆలోచించవచ్చు. అయితే, షమీ తన ఫిట్‌నెస్, ప్రదర్శనతో విమర్శకులకు సమాధానం చెప్పాలని చూస్తున్నాడు.
ఈ వివాదం షమీని ఐపీఎల్ 2025లో మరింత దృఢంగా రాణించేందుకు ప్రేరేపిస్తుందా? లేక ఫ్రాంచైజీలు నిజంగానే మంజ్రేకర్ మాటల్ని పరిగణనలోకి తీసుకుంటాయా? తెలియాలంటే మెగా వేలం వరకు వేచి చూడాల్సిందే.