ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ ఫిన్ అలెన్ కూడా ఒకడు. బెంగళూరు ఫ్రాంఛైజీ తనపై పెట్టుకున్న అంచనాలు, నమ్మకాన్ని నిజం చేస్తూ సూపర్ స్మాష్ టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడీ యంగ్ ప్లేయర్. మొత్తం 37 బంతుల్లో 78 రన్స్ సాధించి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని మెరుపు ఇన్నింగ్స్‌లో ఏకంగా 9 ఫోర్లు, 3 భారీ సిక్స్‌లు ఉన్నాయి. 210కి పైగా స్ట్రైక్‌రేట్‌తో రన్స్ సాధించాడంటే ఆర్సీబీ ప్లేయర్ విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఫిన్ మెరుపు ఇన్నింగ్స్‌తో వెల్లింగ్టన్ ఎనిమిది వికెట్ల తేడాతో కాంటర్‌బరీని ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కాంటర్‌బరీ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే ఆ జట్టు బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. వెల్లింగ్టన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేసింది. ఈ లక్ష్యాన్ని వెల్లింగ్టన్ 11.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి మాత్రమే అందుకుంది.
కాంటర్బరీ ఇచ్చిన లక్ష్యం తేలికైనదే. కానీ కొన్నిసార్లు క్రికెట్‌లో సులభమైన లక్ష్యాలు కూడా కష్టంగా మారతాయి. అయితే ఈ మ్యాచ్‌లో అలా జరగలేదు. అలెన్ అద్భుతమైన ఇన్నింగ్స్ సహాయంతో వెల్లింగ్టన్ ఈ లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది.అలెన్ మొదట నిక్ కెల్లీతో కలిసి 58 పరుగులు చేశాడు. నిక్ 12 బంతుల్లో 24 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే మరొక ఎండ్‌లో ఫిన్ అలెన్ పాతుకుపోయాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. అయితే విజయానికి పది పరుగుల దూరంలో వెనుదిరిగాడు. ఆతర్వాత రచిన్ రవీంద్ర, ట్రాయ్ జాన్సన్ లు జట్టును విజయతీరాలకు చేర్చారు. రాచిన్ 19, జాన్సన్ తొమ్మిది పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఇక ఫిన్ విషయానికొస్తే.. కెరీర్ లో 25 టీ20 మ్యాచులాడిన అతను567 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 163.4పైగా ఉంది.
50 for @FinnAllen32! His first of the competition for @cricketwgtninc. Leading the chase for the Firebirds! Follow play LIVE in NZ with @sparknzsport and TVNZ 1. #SuperSmashNZ pic.twitter.com/mD9BNeOhwr
— Dream11 Super Smash (@SuperSmashNZ) January 1, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..