Viral Video: మైదానంలో డీకే.. డీకే అంటూ ఫ్యాన్స్‌ కేకలు.. దండం పెట్టిన మురళీ విజయ్‌.. వైరలవుతోన్న వీడియో

|

Jul 26, 2022 | 7:34 PM

Murali Vijay: తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ (TNPL) లో ఆడుతోన్న టీమిండియా సీనియర్‌ ఆటగాడు, టెస్ట్‌ స్పెషలిస్ట్‌ మురళీ విజయ్‌ (Murali Vijay)కు చేదు అనుభవం ఎదురైంది. ఈ టోర్నీలో రూబీ ట్రిక్కివారియర్స్‌ తరఫున బరిలోకి దిగిన విజయ్‌ను మ్యాచ్‌ జరుగుతుండగా అభిమానులు ఆట పట్టించారు. మురళి బౌండర్‌ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తుండగా 'డీకే..డీకే' అంటూ ఫ్యాన్స్‌ కేకలు పెట్టారు..

Viral Video: మైదానంలో డీకే.. డీకే అంటూ ఫ్యాన్స్‌ కేకలు.. దండం పెట్టిన మురళీ విజయ్‌.. వైరలవుతోన్న వీడియో
Dinesh Karthik Murali Vija
Follow us on

Murali Vijay: తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ (TNPL) లో ఆడుతోన్న టీమిండియా సీనియర్‌ ఆటగాడు, టెస్ట్‌ స్పెషలిస్ట్‌ మురళీ విజయ్‌ (Murali Vijay)కు చేదు అనుభవం ఎదురైంది. ఈ టోర్నీలో రూబీ ట్రిక్కివారియర్స్‌ తరఫున బరిలోకి దిగిన విజయ్‌ను మ్యాచ్‌ జరుగుతుండగా అభిమానులు ఆట పట్టించారు. మురళి బౌండర్‌ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తుండగా ‘డీకే..డీకే’ అంటూ ఫ్యాన్స్‌ కేకలు పెట్టారు. దీంతో విజయ్‌ తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. అలా అరవొద్దంటూ దండం పెడుతూ అందరినీ వేడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా క్రికెట్‌ ఫ్యా్న్స్‌ మురళీ పట్ల ఇలా ప్రవర్తించడానికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దినేశ్‌ కార్తీక్‌ (Dinesh Karthik) మొదటి భార్యను నిఖిత వంజరను మురళీ విజయ్‌ను పెళ్లి చేసుకున్నాడు. అంతకుముందు వీరిద్దరు మంచి స్నేహితులు. అయితే డీకే సతీమణిని మురళీ వలలో వేసుకుని అనైతికంగా పెళ్లి చేసుకున్నాడు.

గోడకు కొట్టిన బంతిలా..

ఇవి కూడా చదవండి

ఇక భార్యతో విడాకుల సమయంలో డీకే తీవ్ర నిరాశ నిస్పృహలకు గురయ్యాడు. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఆటపై దృష్టిపెట్టలేకపోవడంతో టీమిండియాలో చోటు కూడా కోల్పోయాడు. అయితే ప్రముఖ స్క్వాష్‌ క్రీడాకారిణి దీపిక పల్లికల్‌ డీకే జీవితంలోకి రావడంతో అతని జీవితం చిగురించింది. గోడకు కొట్టిన బంతిలా క్రికెట్‌లోనూ దూసుకొచ్చాడు. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించి 37 ఏళ్ల రిటైర్మెంట్‌ వయసులో మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేశాడు. అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లోనూ అతనికి చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదే సమయంలో సరైన  అవకాశాలు లేక మురళీ విజయ్‌ దేశవాళీ క్రికెట్‌కే పరిమితమయ్యాడు.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..