IND Vs WI: మరో సిరీస్‌పై టీమిండియా కన్ను.. విండీస్‌తో క్లీన్ స్వీప్‌ లక్ష్యంగా బరిలోకి..

విండీస్‌తో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో టీమిండియా తన మ్యాజిక్ చూపిస్తోంది. భారత్ జట్టు బెంచ్ పవర్ ఏంటన్నది..

IND Vs WI: మరో సిరీస్‌పై టీమిండియా కన్ను.. విండీస్‌తో క్లీన్ స్వీప్‌ లక్ష్యంగా బరిలోకి..
India Vs West Indies
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 27, 2022 | 11:30 AM

విండీస్‌తో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో టీమిండియా తన మ్యాజిక్ చూపిస్తోంది. భారత్ జట్టు బెంచ్ పవర్ ఏంటన్నది మరోసారి నిరూపితమైంది. ఓటమి ఖాయం అనుకున్న మ్యాచ్‌లో అక్షర్ పటేల్ తన మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. దీనితో ఇప్పటికే ఈ సిరీస్‌లో 2-0తో లీడ్‌లో ఉన్న టీమిండియా.. ఈరోజు జరగబోయే మూడో వన్డేలోనూ గెలిచి కరేబీయన్లను వైట్‌వాష్ చేయాలని భావిస్తోంది.

ఇదిలా ఉంటే.. విండీస్ జట్టు కూడా ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో విజయం సాధించి.. పరువు నిలబెట్టుకోవాలని ఆశిస్తోంది. ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ భారత్‌కు గట్టి పోటీ ఇచ్చిన విండీస్.. మూడో మ్యాచ్‌లోనూ అదే ఆటతీరు కనబరచాలని అనుకుంటోంది. ఈ తరుణంలో ఇరు జట్ల మధ్య జరిగే లాస్ట్ మ్యాచ్ సిరీస్‌కు ఉత్కంఠకరమైన ఎండింగ్ ఇవ్వనుంది.

భారత్‌దే పైచేయి..

రెండు మ్యాచ్‌లు.. రెండు డిపార్ట్‌మెంట్సూ సూపర్బ్.. అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్‌లో టీమిండియా జోరు మీదుంది. సీనియర్లు లేకపోయినా.. యువ ఆటగాళ్ళతో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు ధావన్. కెప్టెన్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మాన్ గిల్ మరోసారి కీలకం కానున్నారు. అలాగే బౌలింగ్ కూడా అద్భుతంగా ఉంది. సిరాజ్ పొదుపుగా బంతులు వేస్తుంటే.. ఠాకూర్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్‌లు చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో ప్రత్యర్ధులను బెంబేలేత్తిస్తున్నారు. ఇక అక్షర్ పటేల్, చాహల్‌లు స్పిన్నర్లుగా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.

విండీస్ ఆరాటం..

చివరి వన్డేలోనైనా విజయం సాధించాలని విండీస్ ఆరాటపడుతోంది. ప్రత్యర్ధి జట్టు 300 పరుగులు కొట్టినప్పటికీ.. వారికి సమవుజ్జీలమేనని చెప్పడమే కాదు.. చేసి చూపించారు విండీస్ బ్యాటర్లు. ఓపెనర్లు షై హాప్, మేయర్స్.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు బ్రూక్స్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్‌లు బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లు ఆడుతున్నప్పటికీ.. బౌలింగ్ వైఫల్యం విండీస్ జట్టును విజయం సాధించనివ్వకుండా చేస్తోంది. ఈసారి ఆ లోపాలను సరిద్దుకుని.. ఫైనల్ వన్డేలో గెలవాలన్న కసితో దిగుతోంది విండీస్ జట్టు.

జట్ల అంచనా:

భారత్: శిఖర్ ధావన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్(వికెట్ కీపర్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ఆవేశ్ ఖాన్/అర్ష్‌దీప్ సింగ్

విండీస్: షాయ్ హోప్(వికెట్ కీపర్), కైల్ మేయర్స్, షమర్ బ్రూక్స్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్(కెప్టెన్), రోవ్‌మాన్ పావెల్, అకేల్ హోసేన్, రొమారియో షెపర్డ్, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్, హేడెన్ వాల్ష్

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..