Fakhar Zaman Retirement from International Cricket: పాకిస్థాన్ క్రికెట్ జట్టు తుఫాన్ బ్యాట్స్‌మెన్ ఫఖర్ జమాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యాడు. జింబాబ్వే, ఆస్ట్రేలియా సిరీస్‌ల జట్టులో ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌కు పాకిస్థాన్ అవకాశం ఇవ్వలేదు. అలాగే, అతను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా తొలగించారు. దీంతో ఫకర్ జమాన్ నిరాశ చెందాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడంట. పాకిస్తాన్ మీడియా ప్రకారం, పిసిబి ఈ నిర్ణయం ఫఖర్ జమాన్‌ను తీవ్రంగా మనస్తాపానికి గురిచేసిందంట. దీంతో అతను రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని పేర్కొన్నాయి.
ఫఖర్ జమాన్‌ను ఎందుకు తొలగించారనేది పాకిస్థాన్‌లో అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఫిట్‌నెస్ పరీక్షలో ఫకర్ జమాన్ విఫలమయ్యాడని, ఆ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీసీబీ తెలిపింది. మరోవైపు, బాబర్ ఆజంకు అనుకూలంగా మాట్లాడడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. టెస్ట్ జట్టు నుంచి బాబర్ అజామ్‌ను తొలగించిన తరువాత, ఫఖర్ జమాన్ సోషల్ మీడియాలో ఈ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత PCB అతనికి నోటీసులు పంపింది. ఆ తర్వాత ఫఖర్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో విఫలమయ్యాడు. అతను జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు అతని పేరు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా అదృశ్యమైంది.
Fakhar Zaman reportedly considering retirement as PCB excludes him from central contract and upcoming tours
Sources close to Fakhar reveal that his morale has been affected by the selectors’ handling of his case https://t.co/xS6mq1dJYO— Saleem Khaliq (@saleemkhaliq) October 28, 2024
మీడియా కథనాలను విశ్వసిస్తే, ఫఖర్ జమాన్ వచ్చే రెండు నెలల పాటు పాక్ జట్టుకు దూరంగా ఉంటాడు. అతను జనవరి 2025లో మళ్లీ ఫిట్‌నెస్ పరీక్ష చేయించుకుంటాడు. అందులో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ జట్టులో చోటు దక్కించుకోగలడు. ఈ 34 ఏళ్ల ఆటగాడు ఫిట్‌నెస్ పరీక్షలో 2 కి.మీ దూరాన్ని 8 నిమిషాల్లో పూర్తి చేయలేకపోయాడు. ఫఖర్‌కు మోకాలి గాయం ఉందని, దాని కారణంగా అతను 2 కిమీల రేసును నిర్ణీత సమయంలో పూర్తి చేయలేకపోయాడు. మరోవైపు దేహదారుఢ్య పరీక్ష పూర్తి చేయలేకపోయినా ఉస్మాన్ ఖాన్ కు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వడం గమనార్హం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..