Rahul Tripathi Auction Price: రాహుల్ త్రిపాఠి కోసం ఐపీఎల్ మెగా వేలం(IPL 2022 Auction)లో తీవ్రమైన పోటీ నడిచింది. గతంలో కేకేఆర్ తరపున అద్భుత ఇన్నింగ్సులు ఆడిన ఈ యువ బ్యాట్స్‌మెన్.. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) సొంతం చేసుకుంది. రాహుల్ త్రిపాఠి కోసం హైదరాబాద్ రూ. 8.5 కోట్లు ఖర్చు చేసింది. కాగా, ఈ ఆటగాడి బేస్ ప్రైస్ రూ. 40 లక్షలు కావడం విశేషం. ముందుగా చెన్నై బిడ్‌ను ప్రారంభించినా.. మధ్యలో కేకేఆర్ సొంతం చేసుకునేందుకు ప్రయత్నించినా.. చివరకు ఈ రెండు టీంలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ షాకిచ్చి, రూ. 8.5 కోట్లకు సొంతం చేసుకుంది.
ఇప్పటి వరకు 62 మ్యాచులాడిన రాహుల్ త్రిపాఠి 26 సగటుతో, 136 స్రైక్ రేట్‌తో 1385 పరుగులు సాధించాడు. గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన రాహుల్ త్రిపాఠి.. ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడనున్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు..
వాషింగ్టన్ సుందర్ – రూ. 8.75 కోట్లు
భువనేశ్వర్ కుమార్- రూ. 4.2 కోట్లు
నటరాజన్- రూ. 4 కోట్లు
నికోలస్ పూరన్- రూ. 10 కోట్లు
కేన్ విలియమ్సన్ (కెప్టెన్) – రూ. 14 కోట్లు
అబ్దుల్ సమద్ (ఆల్ రౌండర్) – రూ. 4 కోట్లు
ఉమ్రాన్ మాలిక్ (ఫాస్ట్ బౌలర్) – రూ. 4 కోట్లు
రాహుల్ త్రిపాఠి – రూ. 8.5 కోట్లు
Also Read: Dewald Brevis IPL 2022 Auction: హిట్‌మ్యాన్ టీంలోకి బేబీ ‘డివిలియర్స్’.. బౌలర్లకు చుక్కలే.!