బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆధిక్యం ప్రదర్శించేసరికి ఆ జట్టు మాజీలకు మళ్లీ నోరు పారేసుకునేందుకు అవకాశం దక్కింది. టీమిండియాపై అక్కసు వెళ్లగక్కడంలో ఇయాన్ ఛాపెల్, ఇయాన్ హీలీ కాస్త ముందే ఉంటారు. తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఇయాన్ ఛాపెల్ భారత బ్యాటర్లను విమర్శిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. మరీ ముఖ్యంగా నయా వాల్ చతేశ్వర్ పుజారా, శ్రేయస్ అయ్యర్‌పై అనుచిత పదాలను ప్రయోగించాడు. ఎందుకంటే తొలి ఇన్నింగ్స్‌లో పుజారా 2 పరుగులు, అయ్యర్ డకౌట్‌గా వెనుదిరిగారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌట్ కావడం.. ఆసీస్ బౌలర్ కునెమన్ తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేయడంతో తమ ‘ఆసీస్ ప్రదర్శన’ ఇలా ఉంటుందని ఇయాన్ ఛాపెల్ వ్యాఖ్యానించాడు.
‘భారత్ వైపు కొంతమంది ఆటగాళ్లు ఉన్నారు. నా దృష్టిలో వారు స్పిన్ బౌలింగ్‌లో నాణ్యమైన బ్యాటర్లు కాదు. ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు వారిని త్వరగా ఔట్ చేసేశారు. ఈ పిచ్ ద్వారా రెండు అంశాలు జరిగాయి. ఆసీస్ బౌలర్లు చాలా కచ్చితత్వంతో బౌలింగ్ చేశారు. మనం ఆసీస్ తరహా బ్యాటింగ్‌ను భారత క్రికెటర్ల నుంచి చూశాం. చతేశ్వర్ పుజారా తొలి ఇన్నింగ్స్ వరకు చాలా అసౌకర్యంగా అనిపించాడు. ఇక శ్రేయస్ గురించి చాలా మాటలు విన్నా.. స్పిన్ బౌలింగ్‌ను అద్భుతంగా ఆడతాడని చెప్పారు. కానీ, ఇప్పటి వరకు నాకైతే అలా అనిపించలేదు. అతడు చాలా శ్రేయస్ అయితే ఆందోళనకు గురైనట్లు అనిపిస్తోంది. అయితే, ఆసీస్ బ్యాటింగ్ చేసిన సమయంలో ఖవాజా, లబుషేన్ మంచి భాగస్వామ్యం అందించారు’ అని ఛాపెల్ తెలిపాడు.
‘He is a bit of a panicker’ – Ian Chappell shares his thoughts on Shreyas Iyer’s batting calibre against spin https://t.co/AIBk5Zw2eH
— CricAngel (@CricAngel2020) March 2, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..