IND vs WI: తొలి టెస్ట్‌కు ముందు జిమ్‌లో కోహ్లీ కసరత్తులు.. ‘లెగ్ డే’ పై ఆసక్తికర పోస్ట్..

|

Jul 09, 2023 | 9:41 AM

Virat Kohli: భారత జట్టు జులై 12 నుంచి వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ డొమినికాలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ జిమ్‌లో చెమటోడ్చుతున్నాడు.

IND vs WI: తొలి టెస్ట్‌కు ముందు జిమ్‌లో కోహ్లీ కసరత్తులు.. లెగ్ డే పై ఆసక్తికర పోస్ట్..
Virat Kohli
Follow us on

భారత జట్టు జులై 12 నుంచి వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ డొమినికాలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ జిమ్‌లో చెమటోడ్చుతున్నాడు. కోహ్లి జిమ్ ఫొటోలను పంచుకున్నాడు. ఈ ఫొటోలలో అతను కాలితో వ్యాయామాలు చేస్తూ కనిపిస్తున్నాడు. ఒక ఫొటోలో కోహ్లి శిక్షకుడితో కనిపిస్తుండగా, రెండవ చిత్రంలో అతను ఒంటరిగా కనిపిస్తున్నాడు.

ఈ ఫొటోల ద్వారా విరాట్ కోహ్లీ లెగ్ డే గురించి మాట్లాడాడు. “ప్రతిరోజూ లెగ్ డేనే. 8 సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది” అంటూ విరాట్ కోహ్లీ క్యాఫ్షన్ అందించాడు. విరాట్ కోహ్లీ టీమిండియాతో కలిసి వెస్టిండీస్‌లో ఉన్నాడు. అంతకుముందు WTC ఫైనల్స్ ద్వారా టీమిండియా యాక్షన్‌లో కనిపించింది. వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ తర్వాత, భారత జట్టు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌, ఆపై 5 టీ20ఐలు ఆడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

ఇప్పటివరకు కోహ్లీకి టెస్టుల్లో 2023 ఎలా ఉందంటే..

2023లో కోహ్లీ ఇప్పటివరకు 5 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో 8 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన అతను 45 సగటుతో 360 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి ఒక సెంచరీ ఇన్నింగ్స్ (186) వచ్చింది.

అయితే అంతకు ముందు అంటే 2022లో కోహ్లీ మొత్తం 6 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఆ మ్యాచ్‌ల్లో 11 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన అతను 26.50 సగటుతో 265 పరుగులు చేశాడు. ఈ సమయంలో కోహ్లీ కేవలం ఒక అర్ధ సెంచరీ మాత్రమే చేశాడు.

WTC ఫైనల్‌లో సత్తా చాటని విరాట్..

అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా కోహ్లీ బ్యాట్ సైలెంట్‌గా కనిపించింది. కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 49 పరుగులు చేశాడు.

వెస్టిండీస్ పర్యటనకు భారత టెస్టు జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్,  నవదీప్ సైనీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..