లండన్: ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వరల్డ్‌కప్ ఫైనల్ ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
27 ఏళ్ళ తర్వాత తొలిసారి తమ జట్టు ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరడం గొప్ప విజయంగా భావిస్తానన్న అతడు.. ఫలితం గురించి అలోచించి అనవసరంగా ఒత్తిడికి గురికాదలుచుకోలేదని స్పష్టం చేశాడు. తాను ట్రోఫీ అందుకుంటాననే విషయాన్ని పట్టించుకోవడం లేదని.. అనవసరమైన విషయాలు గురించి పట్టించుకోకపోతే.. దాని ఫలితం వేరేలా ఉంటుందని మోర్గాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అంతేకాకుండా తమ జట్టులోని ప్రతి ఆటగాడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండడం కలిసొచ్చే అంశమని మ్యాచ్ ముందు మీడియాకు తెలిపాడు.
కాగా ప్రస్తుతం ఇంగ్లాండ్.. కివీస్ విధించిన 242 టార్గెట్ ఛేదించే క్రమంలో బ్యాటింగ్‌కు దిగింది. లీగ్ స్టేజిలో విజయాలు, ఫామ్ బట్టి చూస్తే మాజీలు ఇంగ్లాండ్ ప్రపంచకప్ కైవసం చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు.