PAK vs ENG: ఐపీఎల్ వద్దన్నాడు.. కట్‌చేస్తే.. ట్రిపుల్ సెంచరీతో ముల్తాన్‌లో విధ్వంసం..

|

Oct 10, 2024 | 2:29 PM

ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ టెస్టు క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. టెస్టు క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఆరో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌గా హ్యారీ బ్రూక్ నిలిచాడు. హ్యారీ బ్రూక్ కంటే ముందు, ఆండీ సాంధమ్, వాలీ హమ్మండ్, లెన్ హట్టన్, జాన్ ఎడ్రిచ్, గ్రాహం గూచ్ ఇంగ్లండ్ తరపున టెస్ట్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీలు సాధించారు.

PAK vs ENG: ఐపీఎల్ వద్దన్నాడు.. కట్‌చేస్తే.. ట్రిపుల్ సెంచరీతో ముల్తాన్‌లో విధ్వంసం..
Harry Brook Triple Century
Follow us on

PAK vs ENG: ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ టెస్టు క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. టెస్టు క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఆరో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌గా హ్యారీ బ్రూక్ నిలిచాడు. హ్యారీ బ్రూక్ కంటే ముందు, ఆండీ సాంధమ్, వాలీ హమ్మండ్, లెన్ హట్టన్, జాన్ ఎడ్రిచ్, గ్రాహం గూచ్ ఇంగ్లండ్ తరపున టెస్ట్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీలు సాధించారు. ముల్తాన్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ తన తుఫాన్ బ్యాటింగ్‌తో పాక్ బౌలర్లపై విధ్వంసం సృష్టించాడు. ముల్తాన్ క్రికెట్ స్టేడియం గురువారం పాకిస్తాన్‌ జట్టుపై హ్యారీ బ్రూక్ భీకర ఇన్నింగ్స్ ఆడేశాడు. హారీ బ్రూక్ తన టెస్ట్ కెరీర్‌లో తొలిసారిగా ట్రిపుల్ సెంచరీ చేసి పాక్ బౌలర్లను చిత్తు చేసి అద్భుత ప్రదర్శన చేశాడు.

364 – లెన్ హట్టన్ v ఆస్ట్రేలియా, ది ఓవల్, 1938

336* – వాలీ హమ్మండ్ vs న్యూజిలాండ్, ఆక్లాండ్, 1933

333 – గ్రాహం గూచ్ v ఇండియా, లార్డ్స్, 1990

325 – ఆండీ సంధమ్ vs వెస్టిండీస్, కింగ్‌స్టన్, 1930

310* – జాన్ ఎడ్రిచ్ vs న్యూజిలాండ్, లీడ్స్, 1965

300* – హ్యారీ బ్రూక్ vs పాకిస్థాన్, ముల్తాన్, 2024*

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..