ENG vs PAK : జూలై 8 న జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్.. పాకిస్థాన్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో తొక్కేసింది. షకీబ్ మహమూద్ (42/4) విజృంభిచడంతో పాకిస్థాన్ 141 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ ఓపెనర్ డేవిడ్ మలన్ (68), జాక్ క్రాలే (58) అజేయంగా అర్ధ సెంచరీలు సాధించడంతో 21.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో మ్యాచ్ జూలై 10 న లార్డ్స్‌లో జరుగుతుంది. తొలి వన్డేలో పాకిస్థాన్‌ను ఓడించిన ఇంగ్లీష్ జట్టులోని మొత్తం 11 మంది ఆటగాళ్ళు మునుపటి ఇంగ్లాండ్ జట్టుకు భిన్నంగా ఉన్నారు.
ఇంగ్లండ్ ఏకైక వికెట్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ రూపంలో పడింది. అతను ఏడు పరుగులు చేసిన తరువాత షాహీన్ అఫ్రిది స్లిప్స్ వద్ద క్యాచ్ పట్టడంతో ఔట్ అవుతాడు. 22 పరుగులకు సాల్ట్ అవుట్ అయిన తరువాత, మలన్, క్రౌలీ రెండో వికెట్ కోసం120 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పుతారు. మలన్ ఎనిమిది ఫోర్ల సాయంతో 68 పరుగులు, క్రౌలీ ఏడు ఫోర్ల సహాయంతో 50 బంతుల్లో అజేయంగా 58 పరుగులు చేశాడు. ఇది క్రౌలీ మొదటి వన్డే మ్యాచ్ అతను తన కెరీర్‌ను ఫిఫ్టీతో ప్రారంభించడం విశేషం.
అంతకుముందు ఫాస్ట్ బౌలర్ షకీబ్ మహమూద్ సహాయంతో ఇంగ్లండ్ 35.2 ఓవర్లలో 141 పరుగులకే పాకిస్థాన్‌ను కట్టడి చేసింది. షకీబ్ 42 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్ల ముందు పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ నిలవలేకపోయారు. తొలి ఓవర్లోనే పాకిస్తాన్ రెండు వికెట్లు కోల్పోయింది. ఫఖర్ జమాన్ 47 పరుగులు చేయగా, షాదాబ్ ఖాన్ 30 పరుగులు చేశాడు. సోహైబ్ మక్సూద్ 19 పరుగులు చేయగా, మహ్మద్ రిజ్వాన్ 13, షాహిన్ షా అఫ్రిది 12 పరుగులు చేశారు. షకీబ్ మహమూద్‌తో పాటు లూయిస్ గ్రెగొరీ, మాట్ పార్కిన్సన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.