4వ టెస్ట్‌కు ముందే టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. ఒక్క ఆటగాడు మైదానంలోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ లేదుగా..?

Emirates Old Trafford, Manchester Weather Report: మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో టీమిండియా రికార్డు నిరాశజనకంగా ఉంది. భారత్ ఇక్కడ ఆడిన 9 టెస్ట్ మ్యాచ్‌లలో ఒక్కటి కూడా గెలవలేదు. 4 మ్యాచ్‌లలో ఓటమి పాలవ్వగా, 5 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఈ నేపధ్యంలో, వరుణుడు కరుణించి మ్యాచ్ సజావుగా సాగాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.

4వ టెస్ట్‌కు ముందే టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. ఒక్క ఆటగాడు మైదానంలోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ లేదుగా..?
Ind Vs Eng 4th Test Weather Report

Updated on: Jul 22, 2025 | 7:06 PM

England vs India, 4th Test: మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో బుధవారం (జులై 23, 2025) నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్, భారత్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్‌పై వరుణుడు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం మాంచెస్టర్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఇది రాబోయే ఐదు రోజుల్లోనూ కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నివేదికలు సూచిస్తున్నాయి.

సీరీస్‌లో కీలక మ్యాచ్‌పై వర్షం ప్రభావం..

ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. సిరీస్‌ను సమం చేయాలంటే టీమిండియా ఈ నాలుగో టెస్ట్‌లో తప్పక గెలవాలి. ఇలాంటి కీలక సమయంలో వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించడం అభిమానులను, ఆటగాళ్లను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది.

అక్యువెదర్ నివేదికల ప్రకారం, మ్యాచ్ ప్రారంభమయ్యే జులై 23 బుధవారం నాడు వర్షం పడే అవకాశం 25% ఉంది. జులై 24 గురువారం కూడా 25% వర్షం పడే అవకాశం ఉండగా, జులై 25 శుక్రవారం నాడు వర్షం పడే అవకాశం 50% వరకు పెరుగుతుందని అంచనా. ఇక నాలుగో రోజు జులై 26న 25% వర్షం పడే అవకాశం ఉండగా, ఐదో రోజు జులై 27న ఏకంగా 58% వర్షం పడే అవకాశం ఉంది. దీని బట్టి చూస్తే, మ్యాచ్ జరిగే ఐదు రోజుల్లోనూ వర్షం అంతరాయం కలిగించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

పిచ్ పరిస్థితి మరి, భారత్ రికార్డు..

ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ సాధారణంగా బ్యాట్స్‌మెన్లకు, బౌలర్లకు ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది. ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు మద్దతు లభిస్తుంది. అయితే బ్యాట్స్‌మెన్ క్రీజ్‌లో నిలదొక్కుకుంటే భారీ స్కోర్లు చేయగలరు. మూడో రోజు నుంచి స్పిన్నర్లకు కూడా పిచ్ అనుకూలంగా మారుతుంది. అయితే, వర్షం పడితే పిచ్ తేమగా మారి పేసర్లకు మరింత ప్రయోజనం చేకూరుస్తుంది.

మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో టీమిండియా రికార్డు నిరాశజనకంగా ఉంది. భారత్ ఇక్కడ ఆడిన 9 టెస్ట్ మ్యాచ్‌లలో ఒక్కటి కూడా గెలవలేదు. 4 మ్యాచ్‌లలో ఓటమి పాలవ్వగా, 5 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఈ నేపధ్యంలో, వరుణుడు కరుణించి మ్యాచ్ సజావుగా సాగాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. గాయాల బెడద కూడా టీమిండియాను వెంటాడుతోంది. ఇప్పటికే పలువురు కీలక ఆటగాళ్లు గాయాలపాలవ్వడం జట్టుకు ఆందోళన కలిగిస్తోంది.

ఈ కీలక టెస్ట్ మ్యాచ్‌పై వర్షం ఎలాంటి ప్రభావం చూపుతుందో, శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు సిరీస్‌ను సమం చేయగలదా లేదా అన్నది వేచి చూడాలి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..