
లార్డ్స్ టెస్టులో నాలుగో రోజు ఆట రసవత్తరంగా మారింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ తక్కువ పరుగులకే ఆలౌట్ కాగా.. టీమిండియా బౌలర్ల ఆటతీరు మెచ్చుకోదగిన విధంగా ఉంది. ముఖ్యంగా బ్యాటర్లు చెలాయించిన ప్రతీసారి తన బంతితో మెరుపులు మేరిపిస్తున్నాడు ఆకాష్ దీప్. భారత పేసర్ ఆకాష్ దీప్.. ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్‌ను షాక్‌కు గురి చేశాడు. లార్డ్స్ టెస్ట్ నాల్గవ రోజు తొలి సెషన్‌లోనే భారత బౌలర్లు ఇంగ్లాండ్‌పై ఆధిపత్యం చెలాయించారు.
మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు, నితీష్ కుమార్ రెడ్డి ఒక వికెట్ తీసి ఇంగ్లాండ్‌ను ఇబ్బందుల్లో పడేశారు. ఆ తర్వాత హ్యారీ బ్రూక్ వికెట్.. ఆకాష్ దీప్ పడగొట్టాడు. భారత పేసర్ ఓవర్ చివరి 3 బంతుల్లో బ్రూక్ వరుసగా రెండు స్కూప్ షాట్లు ఆడాడు. చివరి బంతికి సిక్స్ బాదాడు. మునపటి మాదిరిగానే ఆకాష్ దీప్‌ను టార్గెట్ చేసిన బ్రూక్.. స్కూప్ షాట్ ఆడబోయి మిడిల్ స్టంప్‌ను దొరికి పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలోనే కామెంటేటర్ సంగక్కర కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇది బజ్‌బాల్ కాదని.. పొగరు అని అభివర్ణించాడు. బ్రూక్ ఇప్పటికే ఆకాష్ దీప్ బౌలింగ్‌లో 15 పరుగులు చేసినా.. మళ్లీ అదే ట్రై చేయబోయి ఓ చౌక షాట్ ఆడి.. పెవిలియన్ చేరాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..