IPL 2023: ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి స్టార్ బౌలర్.. జోష్‌లో ఫ్యాన్స్..

|

Mar 01, 2023 | 9:09 PM

Mumbai Indians: ఐపీఎల్ 2023 ప్రారంభం కాకముందే ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మొత్తం సీజన్‌కు దూరంగా ఉన్నాడు.

IPL 2023:  ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి స్టార్ బౌలర్.. జోష్‌లో ఫ్యాన్స్..
Ipl 2023
Follow us on

Jofra Archer: ఐపీఎల్ 2023 ప్రారంభం కాకముందే ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మొత్తం సీజన్‌కు దూరంగా ఉన్నాడు. అయితే, ఈ సమయంలో ముంబై ఇండియన్స్‌కు భారీ ఉపశమనం కలిగించే ఓ వార్త కూడా వచ్చింది. గాయం కారణంగా గత ఏడాది ఐపీఎల్‌లో ఆడని జోఫ్రా ఆర్చర్ ఈ సీజన్ మొత్తం ముంబై ఇండియన్స్‌కు అందుబాటులో ఉండనున్నాడు. ఇది జట్టుకు చాలా శుభవార్త కానుంది.

జోఫ్రా ఆర్చర్ చాలా కాలం పాటు క్రికెట్ యాక్షన్‌కు దూరమయ్యాడు. కానీ, సంవత్సరం తిరిగి వచ్చాడు. అతను SA20 లీగ్‌తో క్రికెట్‌కు తిరిగి వచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్నాడు.

బుధవారం క్రిక్‌బజ్‌తో ఈసీబీలోని ఓ అధికారి మాట్లాడుతూ, మొత్తం ఐపీఎల్ సీజన్‌కు ఆర్చర్ అందుబాటులో ఉంటాడని తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

కాగా, బంగ్లాదేశ్‌తో ఢాకాలో జరిగిన తొలి వన్డేలో జోఫ్రా ఆచార్ బౌలింగ్ చేసి వికెట్లు కూడా తీశాడు. 10 ఓవర్లు వేసిన అతను 37 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.

IPL 2023లో బెంగళూరుతో ముంబై ఇండియన్స్ తమ ప్రచారాన్ని ప్రారంభించనుంది. IPL 2023 సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఇందులో 70 లీగ్ దశ మ్యాచ్‌లు ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఉన్నాయి. ఈసారి మొత్తం 12 వేదికలను నిర్ణయించారు. అన్ని జట్లకు వారి సొంత మైదానాల్లో కూడా ఆడేందుకు అవకాశం కల్పిస్తారు. ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడితే, ఈ సీజన్‌లో జట్టు తమ మొదటి మ్యాచ్‌ని ఏప్రిల్ 2న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడుతుంది. అయితే చివరి లీగ్ మ్యాచ్ మే 21న ముంబైలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..