India Vs England 2021: భారత్‌తో చివరి రెండు వన్డేలకు ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ దూరం… అతని స్థానంలో ఎవరంటే…
వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టుకు గాయాల సమస్య వేధిస్తోంది. కెప్టెన్ మోర్గాన్ చివరి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. సామ్ బిల్లింగ్స్ రెండో వన్డేకు అందుబాటులో ఉండట్లేదు.
వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టుకు గాయాల సమస్య వేధిస్తోంది. కెప్టెన్ మోర్గాన్ చివరి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. సామ్ బిల్లింగ్స్ రెండో వన్డేకు అందుబాటులో ఉండట్లేదు.
టీమిండియాతో తొలి వన్డేలో ఓడిన ఇంగ్లాండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయాలతో బాధపడుతున్న కెప్టెన్ మోర్గాన్ చివరి రెండు మ్యాచులకు దూరంగా ఉంటాడని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. మరోవైపు.. సామ్ బిల్లింగ్స్ రెండో మ్యాచ్‌కు అందుబాటులో ఉండట్లేదు.
ఈ మ్యాచ్‌లకు జాస్ బట్లర్ తాత్కాలిక సారథిగా వ్యవహరించనున్నాడు. లియమ్ లివింగ్‌స్టోన్ ఈ మ్యాచ్‌తో వన్డే బెబ్యూ ఆటగాడిగా పరిచయం కానున్నాడు. పుణె వేదికగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్ 66 పరుగుల తేడాతో ఓడిపోయింది. టీమిండియా బ్యాట్స్‌మన్ ధావన్, కోహ్లీ, కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్య హాఫ్ సెంచరీలతో చెలరేగి ఆడటంతో మ్యాచ్ విజయం సాధించింది. ఆకట్టుకునేలా సాగిన వీరి ప్రదర్శన జట్టుకు విజయాన్ని అందించింది. అయితే ఇదే మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ మ్యాచుకు దూరమయ్యాడు.
360 డిగ్రీల వీరుడు సూర్యకుమార్ అరంగేట్రం ఖాయమైంది. ఆటగాళ్ల విషయంలో టీమిండియాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. భుజానికి గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో టీ-20ల్లో దుమ్మురేపిన సూర్యకుమార్ యాదవ్ జట్టులో చేరనున్నాడు. రవీంద్ర జడేజా స్థానాన్ని టెస్ట్ ఫార్మాట్లలో అక్షర్ పటేల్ అందిపుచ్చుకోగా వన్డేల్లో కృనాల్ పాండ్య దక్కించుకున్నాడు. ఐపీఎల్‌లో పేరు తెచ్చుకున్న ప్రసిద్ధ్ కృష్ణ అరంగేట్రంలో అదుర్స్ అనిపించాడు. అందుకే జడ్డూ, షమి, బుమ్రా వస్తే టీమ్‌ఇండియా బలం మరింత పెరగనుంది.