హార్డ్ హిట్టింగ్‌లో ఇంగ్లాండే ది బెస్ట్!

|

Jul 14, 2019 | 5:15 PM

లార్డ్స్: ఆతిధ్య ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇది ఇలా ఉండగా కివీస్ జట్టును ఓ రికార్డు ఇప్పుడు బాగా టెన్షన్ పెడుతోందని చెప్పవచ్చు. ఇప్పటివరకు ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లు పరిశీలిస్తే.. తొలి పది ఓవర్లలో స్ట్రాంగ్‌గా బ్యాటింగ్ చేసిన జట్టే.. మంచి స్కోర్ సాధిస్తుంది. ఈ జాబితాలో ఇంగ్లాండ్ జట్టు ఇప్పటి వరకు […]

హార్డ్ హిట్టింగ్‌లో ఇంగ్లాండే ది బెస్ట్!
Follow us on

లార్డ్స్: ఆతిధ్య ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇది ఇలా ఉండగా కివీస్ జట్టును ఓ రికార్డు ఇప్పుడు బాగా టెన్షన్ పెడుతోందని చెప్పవచ్చు. ఇప్పటివరకు ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లు పరిశీలిస్తే.. తొలి పది ఓవర్లలో స్ట్రాంగ్‌గా బ్యాటింగ్ చేసిన జట్టే.. మంచి స్కోర్ సాధిస్తుంది. ఈ జాబితాలో ఇంగ్లాండ్ జట్టు ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో తొలి పది ఓవర్లలో 117.67 బ్యాటింగ్ యావరేజ్ ఉండగా.. కివీస్‌కు 28.28 మాత్రమే ఉంది. ఇక రన్‌రేట్‌లో ఇంగ్లాండ్ 5.88 ఉండగా.. న్యూజిలాండ్ మాత్రం 4.40తో వెనుకబడింది. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్‌లో కూడా కివీస్ తొలి పవర్‌ప్లే ముగిసే సమయానికి 3.44 రన్‌రేట్‌తో మాత్రమే పరుగులు చేసింది.