ICC Awards: భారత్‌పై భారీ ఇన్నింగ్స్‌కు ప్రత్యేక బహుమానం.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ ది మంత్‌గా ఎవరంటే?

|

Jul 11, 2022 | 9:25 PM

బెయిర్‌స్టో జూన్‌లో 3 టెస్టు మ్యాచ్‌ల్లో 394 పరుగులు చేశాడు. జులై మొదటి వారంలో భారత్‌తో జరిగిన ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు సాధించాడు. అయితే, ఈ ఏడాది అవార్డులో అది లెక్కించలేదు.

ICC Awards: భారత్‌పై భారీ ఇన్నింగ్స్‌కు ప్రత్యేక బహుమానం.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ ది మంత్‌గా ఎవరంటే?
Icc Player Of The Month Awards, Jonny Bairstow, Marizanne Kapp
Follow us on

ఇంగ్లండ్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టో ఐసీసీ అవార్డుల్లో సత్తా చాటాడు. కుడిచేతి వాటం తుఫాన్ బ్యాట్స్‌మెన్ బెయిర్‌స్టో బ్యాట్‌తో, గత కొన్ని రోజులుగా ప్రపంచంలోని అనేక మంది అత్యుత్తమ బౌలర్‌లను చితక్కొడుతున్నాడు. ఇందుకుగానూ అతనికి ఐసీసీ నుంచి ప్రత్యేక పారితోషికం లభించింది. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి నుంచి గౌరవం లభించింది. అతనితో పాటు, దక్షిణాఫ్రికా స్టార్ ఆల్ రౌండర్ మారిజ్నే క్యాప్‌ను ఐసీసీ అందించింది. జూన్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు పురుషుల, మహిళల విభాగాల్లో ఐసీసీ జులై 11, సోమవారం నాడు ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును ప్రకటించింది. పురుషులలో బెయిర్‌స్టోకు ఈ గౌరవం లభించింది.

బెయిర్‌స్టో గత నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండు వరుస టెస్టు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు సాధించాడు. ఈ దూకుడు బ్యాట్స్‌మెన్ అంతకుముందు నాటింగ్‌హామ్‌లో 136 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత లీడ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 71 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ ఆధారంగానే ఇంగ్లండ్ రెండు టెస్టుల్లోనూ విజయం సాధించింది.

బెయిర్‌స్టో జూన్‌లో 3 టెస్టు మ్యాచ్‌ల్లో 394 పరుగులు చేశాడు. జులై మొదటి వారంలో భారత్‌తో జరిగిన ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు సాధించాడు. అయితే, ఈ ఏడాది అవార్డులో అది లెక్కింలేదు.

ఇవి కూడా చదవండి

మరోవైపు, ఇంగ్లండ్‌పై మెరుపు సెంచరీ చేసినందుకు మహిళలలో, స్టార్ దక్షిణాఫ్రికా ఆల్-రౌండర్ మారిజ్నే కాప్ ఈనెల ఉత్తమ క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. క్యాప్ తన అరంగేట్రం టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 43 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతోపాటు తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు.